పాతబస్తీలో మరికొన్ని కరోనా కేసులు?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌ లో ఒకరిని బలితీసుకుంది. దీంతో దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. మృతుడు కర్ణాటక రాష్ట్రంలోని కల్‌ బుర్గికి చెందిన 76ఏళ్ల సిద్దిఖి ఈనెల 10వ తేదీనే మరణించినా… అతడికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్టు రిపోర్ట్‌లు నిన్ననే అందాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. కలబుర్గికి చెందిన మహ్మద్‌ సిద్ధిఖి జనవరి 29న సౌదీకి పని నిమిత్తం వెళ్లాడు. పని ముగించుకుని నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 29న […]

Written By: Neelambaram, Updated On : March 13, 2020 4:48 pm
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌ లో ఒకరిని బలితీసుకుంది. దీంతో దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. మృతుడు కర్ణాటక రాష్ట్రంలోని కల్‌ బుర్గికి చెందిన 76ఏళ్ల సిద్దిఖి ఈనెల 10వ తేదీనే మరణించినా… అతడికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్టు రిపోర్ట్‌లు నిన్ననే అందాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

కలబుర్గికి చెందిన మహ్మద్‌ సిద్ధిఖి జనవరి 29న సౌదీకి పని నిమిత్తం వెళ్లాడు. పని ముగించుకుని నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 29న భారత్‌ కు వచ్చాడు. సౌదీ నుంచి అతడు నేరుగా హైదరాబాద్‌ పాతబస్తీలోని బంధువులు ఇంటికి వచ్చాడు. అక్కడే మార్చి 5 వరకు ఉన్నాడు. ఈనేపథ్యంలో సిద్ధిఖి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. సౌదీ నుండి హైదరాబాద్ కు వచ్చి పాతబస్తీలో దాదాపు 10రోజులు నివాసమున్న సిద్దిఖికి కరోనా సోకి మూడురోజుల క్రితం చనిపోయాడు. దింతో 10రోజులలో అతను ఎవరెవరిని కలిసాడో తెలియదు. వారికి కూడా ఈ వైరస్ సోకె ప్రమాదం ఉంది.