https://oktelugu.com/

Kanguva movie Twitter Review : కంగువా ట్విట్టర్ టాక్: సూర్య వన్ మ్యాన్ షో, మూవీ ఎలా ఉందంటే?

కంగువా ఫైనల్లీ థియేటర్స్ లోకి వచ్చేసింది. సూర్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. యూఎస్ ప్రీమియర్స్ ఆల్రెడీ ముగిశాయి. సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ తెలియజేస్తున్నారు. కంగువా మూవీ ట్విట్టర్ టాక్ ఏమిటో చూద్దాం..

Written By: NARESH, Updated On : November 14, 2024 8:37 am
Follow us on

Kanguva movie Twitter Review : సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది కంగువా. సూర్య రెండు భిన్నమైన పాత్రలు చేశాడు. కంగువా అలాగే ఫ్రాన్సిస్ గా ఆయన కనిపించారు. యానిమల్ మూవీతో సౌత్ లో కూడా పాపులారిటీ రాబట్టిన బాబీ డియోల్ మెయిన్ విలన్ ఉధిరన్ పాత్ర చేశాడు. దిశా పటాని హీరోయిన్ గా నటించింది. యోగిబాబు, కేఎస్ రవికుమార్, మన్సూర్ అలీ ఖాన్, కోవై సరళతో పాటు స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో భాగమయ్యారు.

నవంబర్ 14న తెలుగు, తమిళ భాషల్లో కంగువా విడుదల చేశారు. కంగువా చిత్రానికి శివ దర్శకుడు కాగా.. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కంగువా మూవీ రెండు కాలాల్లో సాగే కథ. వేల ఏళ్ళ క్రితం తెగల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరును మోడరన్ ఏజ్ తో ముడిపెట్టి కథ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు ఫలించింది.

ఆడియన్స్ అభిప్రాయంలో కంగువా డీసెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ పర్లేదు బాగుంది. సినిమా ఆరంభం ఆకట్టుకుంది. రెండు మూడు యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. అనంతరం మూవీ నెమ్మదిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ సైతం మరీ అంత ప్రభావవంతంగా లేదు. అంచనా వేయగలిగేలా ఉంది అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ బోరింగ్ గా సాగుతుందని అంటున్నారు. అయితే సూర్య నటనకు మార్క్స్ వేస్తున్నారు. సూర్య నట విశ్వరూపం మనం కంగువా మూవీలో చూడొచ్చు. కంగువా సూర్య వన్ మ్యాన్ షో అనే అభిప్రాయం వినబడుతుంది.

బాబీ డియోల్ సైతం తన పాత్రకు న్యాయం చేశాడని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ దిశా పటాని ప్రస్తావన పెద్దగా లేదు. ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదనిపిస్తుంది. దర్శకుడు శివ స్క్రీన్ ప్లే పరంగా విఫలం చెందాడని ఆడియన్స్ అభిప్రాయం. మంచి కథ ఎంచుకున్నప్పటికీ దాన్ని ఆకర్షణీయంగా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేదని అంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. కొత్తగా ఏం లేదని అంటున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మూవీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. భారీ అంచనాలు పెట్టుకొని వెళితే నిరాశ తప్పదు అనేది ఆడియన్స్ కామెంట్స్ పరిశీలిస్తే అర్థం అవుతుంది. మొత్తంగా సూర్య నటన కోసం కంగువ ఒకసారి చూడవచ్చు.