Homeఎంటర్టైన్మెంట్Matka Movie Twitter Review: మట్కా ట్విట్టర్ టాక్: వరుణ్ తేజ్ కి హిట్ పడ్డట్లేనా,...

Matka Movie Twitter Review: మట్కా ట్విట్టర్ టాక్: వరుణ్ తేజ్ కి హిట్ పడ్డట్లేనా, ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

Matka Movie Twitter Review: మెగా హీరో వరుణ్ తేజ్ హిట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గత రెండు చిత్రాలు గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ దారుణ పరాజయం చవి చూశాయి. ఈ ప్రభావం ఆయన లేటెస్ట్ మూవీపై పడింది. మట్కా చిత్రానికి ఓపెనింగ్స్ కరువయ్యాయి. మట్కా చిత్రంపై కనీస బజ్ లేదు. బుకింగ్స్ గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ క్రమంలో మట్కా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే విజయం సాధిస్తుంది. లేదంటే వసూళ్లు రావడం కష్టమే. మరి వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ మట్కా ప్రేక్షకులను మెప్పించిందా?

మట్కా మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించారు. వరుణ్ తేజ్ మట్కా వాసు అనే పాత్ర చేశారు. ఈ పాత్రకు గ్యాంగ్ స్టర్ రతన్ ఖేత్రీ అనే వ్యక్తి జీవితం స్ఫూర్తి. అణగారిన వర్గానికి చెందిన రతన్ ఖేత్రీ మట్కా అనే ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ ద్వారా గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. అతని కథే ఈ మట్కా చిత్రం.

సినిమా ఎలా ఉందంటే… పీరియాడిక్ సెటప్, ఆర్ట్ వర్క్ మెప్పిస్తుంది. 70-80ల నాటి పరిస్థితులను తలపించేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ సెట్స్ వేశారు. అందుకే ఈ మూవీ బడ్జెట్ కూడా పెరిగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. భిన్నమైన గెటప్స్ లో వరుణ్ తేజ్ ఈ చిత్రంలో కనిపిస్తాడు. యంగ్ లేబర్ నుండి మిడిల్ ఏజ్ గ్యాంగ్ స్టర్ వరకు వివిధ ఏజ్, క్లాస్ వేరియేషన్స్ మనం చూడొచ్చు.

వరుణ్ తేజ్ నటన సినిమాకు హైలెట్. వరుణ్ తేజ్ మీద తెరకెక్కించిన ఎలివేషన్ సీన్స్ సైతం మెప్పిస్తాయి. విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇవి సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అదే సమయంలో కథలో కొత్తదనం లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినప్పటికీ.. కెజిఎఫ్, పుష్ప చిత్రాలను ఈ మూవీ తలపిస్తుందని అంటున్నారు.

స్క్రీన్ ప్లే సైతం అంత స్ట్రాంగ్ గా లేకపోవడం మరొక మైనస్ అంటున్నారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ పర్లేదట. మొత్తంగా మట్కా చిత్రం ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. యాక్షన్, క్రైమ్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. వారిని మెప్పిస్తుందని అంటున్నారు. సో ఈ వీకెండ్ ఒకసారి ట్రై చేయండి..

Exit mobile version