https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : అవినాష్ అంటే బిగ్ బాస్ కు ఎందుకు అంత ప్రత్యేకమైన ప్రేమ..? అను కోసం ఇన్ని ఏర్పాట్లు ఎందుకో!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో బిగ్ బాస్ ఎందుకో మొదటి నుండి అవినాష్ కి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు చూసే ఆడియన్స్ కి అనిపిస్తుంది

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 08:39 AM IST

    Why is Avinash so special to Bigg Boss? Why so many arrangements for Anu!

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో బిగ్ బాస్ ఎందుకో మొదటి నుండి అవినాష్ కి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు చూసే ఆడియన్స్ కి అనిపిస్తుంది. స్క్రీన్ స్పేస్ కూడా అవినాష్ కి దొరికిన రేంజ్ లో మరో కంటెస్టెంట్ కి దొరకడం లేదు. అతన్ని ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ బాస్ అన్ని విధాలుగా వాడుకుంటున్నాడు. కిచెన్ టైమర్ పెంచాలంటే కచ్చితంగా అవినాష్ చేత టాస్క్ చెయ్యించాల్సిందే. కేవలం అతని వల్లే కిచెన్ టైం వస్తుందని ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేస్తున్నాడు బిగ్ బాస్. వాస్తవానికి నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తే, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ రాకపోతే ఈ సీజన్ డిజాస్టర్ కా బాప్ అయ్యేది. గౌతమ్, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వంటి వారు బోలెడంత కంటెంట్ ని ఇస్తున్నారు. ముఖ్యంగా అవినాష్ కామెడీ కి టీఆర్పీ రేటింగ్స్ బాగా వస్తున్నాయట. అందుకే బిగ్ బాస్ టీం అతన్ని పూర్తిగా వినియోగించుకుంటుంది.

    ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్ సతీమణి అనుజ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది. ఈమె వచ్చే ముందు బిగ్ బాస్ టీం ఆమె కోసం చాలా సెటప్ చేసారు. ఎన్నడూ లేని విధంగా హౌస్ మేట్స్ అందరూ బాగా అలిసిపోయారు, కాసేపు నిద్రపోండి అని పగలు పూట ఆఫర్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరూ పడుకొని ఉండగా, అవినాష్ భార్య అనుజ హౌస్ లోకి వస్తుంది. హౌస్ లోకి రాగానే నేరుగా ఆమె అవినాష్ బెడ్ దగ్గరకు వెళ్లి ఆయన పక్కనే పడుకుంటుంది. దీంతో అవినాష్ ఉలిక్కి పడి పైకి లేస్తాడు. అకస్మాత్తుగా నా పక్కన వచ్చి పడుకున్నది ఎవరబ్బా అని భయపడ్డాను అని అంటాడు అవినాష్. అప్పుడు టేస్టీ తేజ మాట్లాడుతూ ఎవరని అనుకున్నావో చెప్పు ?, నాకు తెలిసి నలుపు రంగు డ్రెస్ వేసుకుంది కాబట్టి యష్మీ అనుకున్నావ్ కదా అని సరదాగా అంటాడు తేజ, దానికి అనుజ కూడా నవ్వుతుంది.

    ఇదంతా అయ్యాక గార్డెన్ ప్రాంతంలో కాసేపు అనుజ తో ఏకాంతంగా మాట్లాడుతాడు అవినాష్. ఆమె అవినాష్ కి సూచనలు చెప్తూ ‘అంత బాగా ఆడుతున్నావ్. కానీ ఎంటర్టైన్మెంట్ కేవలం ఫన్నీ టాస్కులు ఇచ్చినప్పుడే కాదు, మిగతా సమయాల్లో కూడా చెయ్యి’ అని అంటుంది. అప్పుడు అవినాష్ దానికి సమాధానం చెప్తూ ‘చేస్తున్నాను..కానీ కొంతమంది కేవలం వాళ్ళ మనుషులతోనే ఉంటున్నారు. వాళ్ళ ప్రైవేట్ స్పేస్ లోకి వెళ్లి కామెడీ చేయలేము కదా’ అని అంటాడు అవినాష్. ఇక తర్వాత అవినాష్, అనుజ ని యాక్షన్ రూమ్ లోకి పిలుస్తాడు బిగ్ బాస్. అక్కడ వాళ్ళిద్దరి కోసం ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ ని ఏర్పాటు చేసి రుచికరమైన వంటకాలతో డిన్నర్ పెడుతాడు బిగ్ బాస్. హౌస్ లో మొదటి వారం నుండి ఉంటున్న కంటెస్టెంట్స్ ని కూడ పక్కన పెట్టి, కేవలం అవినాష్ కి మాత్రమే ఎందుకు ఇలాంటి స్పెషల్ ప్యాకేజీలు అని ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు సోషల్ మీడియా లో కాస్త బిగ్ బాస్ టీం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.