Homeఎంటర్టైన్మెంట్Kangana: నాకు కాబోయే భర్తను త్వరలోనే తెలుసుకుంటారు- కంగనా

Kangana: నాకు కాబోయే భర్తను త్వరలోనే తెలుసుకుంటారు- కంగనా

Kangana: టాలీవుడ్​లో ఏక్​నిరంజన్​ సినిమాతో పరిచయమై.. బాలీవుడ్​లో విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ కంగనా రనౌత్​. తాజాగా, తన అభిమానులకు ఓ గుడ్​న్యూడ్​ చెప్పింది ఈభామ ఇటీవల ఆమె ప్రేమలో పడినట్లు తెలిపింది. వచ్చే ఐదేళ్లలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనాలనుకుంటున్నట్లు పేర్కొంది.ఇటీవలే టైమ్స్​ నౌ సమ్మిట్​ 2021కు హాజరైన కంగనా.. తాను త్వరలోనే వివాహం చేసుకుంటానని స్పష్టం చేసింది. ఒక తల్లిగా, భార్యగా, నూతన భారతదేశ ఆధునీకరణలో పాల్గొనే వ్యక్తిగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే మిస్టర్ కంగనా రనౌత్​ గురించి త్వరలోనే తెలుసుకుంటారని వివరించింది.

kangana-ranouth-revealed-about-her-love-and-marriage

కాగా, ఇటీవలే కంగనా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. గతంలోనూ ఉత్తమ నటిగా పలు జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఒక కళాకారిణిగా తాను ఎన్నో అవార్డులు సాధించినట్లు తెలిపింది. వేల అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. కెరీర్​ ప్రారంభఇంచిన మొదట్లో విజయం అందుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టాయని తెలిపింది. చివరకు ఇప్పుడు ఆ విజయం నన్ను వరించిందని గర్వంగా చెప్పింది. తన మీద ఇప్పటి వరకు విమర్శలతో విరుచుకుపడిన వారందరికీ ఈ అవార్డు సమాధానం చెబుతుందని పేర్కొంది.

వారి నోళ్లు మూతబడతాయని తెలిపింది. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా, ఇటీవల తలైవీ సినిమాతో వచ్చిన కంగనా.. మంచి విజయాన్ని అందుకుంది. జయలలిత బయోపిక్​గా తెరకెక్కిన ఈసినిమా మంచి విజయాన్ని సాధించింది. కాగా, ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో ఫుల్​ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version