Death Actors: అతి తక్కువ కాలంలో ఎదిగేందుకు సినీ రంగం దోహద పడుతుంది. ఎదిగినకొద్దీ ఒదగమని కూడా ఇండస్ట్రీ నేర్పుతుంది. అయితే ఎంతో ఎత్తుకు ఎదిగినా.. మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. విధి ఆడే వింత నాటయంలో అందరం పావులవ్వాల్సిందే. ఎవరైనా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోవాల్సిందే. కొందరు వయసు నిండాక మరణిస్తారు.. కొందరు మధ్య వయసులోనే ప్రాణాలు వొదులుతారు. సినిమా ఇండస్ట్రీలో ఈ రెండు రకాల వారూ ఉన్నారు. ఓ వైపు కెరీర్ మంచి ఊపు మీదున్న సమయంలో.. మంచి గుర్తింపు వస్తున్న సమయంలో కొందరు తారలు అకాల మరణం చెందారు. వారి మరణం వల్ల కొన్ని సినిమాలు ఆగిపోయాయి కూడా. అలా అకాల మరణాలు చెందిన తారలు గురించి తెలుసుకుందామా..

పునీత్ రాజ్ కుమార్: కన్నడ సూపర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ రాజ్ కుమార్ ఈ అక్టోబర్ 29న మరణించారు. జిమ్ చేసిన తరువాత గుండెపోటురావడంతో అకాల మరణం చెందారు. ఆయన మరణంతో శాండిల్ వుడ్ మాత్రమే కాకుండా దేశ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనయింది. 46 సంవత్సరాలు వయసులోనే ఆయన మృతి చెందడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అయితే ఆయన సైన్ చేసిన సినిమాలు లైన్లోనే ఉండగా.. మృతి చెందడం కలిచివేసింది.
శ్రీహరి: రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీహరి మొదట్లో విలన్ గా.. ఆ తరువాత హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాల్లో నటించిన ఈ హీరో కాలేయ వ్యాధితో మరణించాడు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆయన మరణించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకాన్ని పెట్టింది.

Also Read: Balakrishna: బాలయ్యకు మేజర్ ఆపరేషన్.. దర్శకుడు క్రిష్ వల్లే.. ఏం జరిగిందంటే?
రఘువరణ్: సౌత్ ఇండియన్ సినిమాల్లో బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న రఘువరణ్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయన ఎన్నో సినిమాల్లో నటించాడు. 2008లో ఆయన 59 సంవత్సరాల వయసులో మరణించాడు.
వేణుమాధవ్: తెలుగు సినిమా టాప్ కమెడియన్లలో వేణుమాధవ్ ఒకరు. కాలేయ సంబంధిత వ్యాధితో 2019లో ఆయన అకాల మరణం చెందారు. అయన కొన్ని సినిమాల్లో నటిస్తుండగానే మృతి చెందడం అందరినీ బాధించింది.

ఆర్తి అగర్వాల్: నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆర్తి ఆ తరువాత కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కొన్నాళ్ల తరువాత కెరీర్ స్లోగా మారడంతో పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లింది. అయితే మెట్లమీది నుంచి జారిపడి ఆమె మరణించింది.

ఉదయ్ కిరణ్: చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఉదయ్ కిరన్ ఆ తరువాత వరుస హిట్లు కొట్టాడు. కొన్ని రోజులుకెరీర్ బాగానే ఉన్నా ఆ తరువాత ఫేడౌట్ అటాపిక్..

Also Read: అదనంగా డిమాండ్ చేసిన హీరోయిన్.. సినిమా నుంచి తొలగించిన నిర్మాత