Kangana Ranaut :కంగనా రనౌత్ మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో బాంబు పేల్చారు. ఫిల్మ్ ఫేర్ వారు ఫంక్షన్ వస్తే అవార్డు ఇస్తానంటున్నారని..వారు క్వాలిటీ పరంగా కాకుండా కేవలం పరపతి కోసం ఇలా అవార్డులు ఇస్తున్నారని ధ్వజమెత్తింది. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీస్ లో తన సందేశాన్ని పంచుకుంది. “నేను 2014 నుండి ఫిల్మ్ ఫేర్ వంటి అనైతిక, అవినీతి మరియు పూర్తిగా అన్యాయమైన పద్ధతులను నిషేధించాను. కానీ ఈ సంవత్సరం వారి అవార్డు ఫంక్షన్‌కు హాజరు కావాలని వారి నుండి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే వారు నాకు తలైవికి అవార్డు ఇవ్వాలనుకుంటున్నారు.. అని విని నేను షాక్ అయ్యాను. వారు ఇప్పటికీ నన్ను నామినేట్ చేస్తున్నారని తెలుసుకున్నాను. అలాంటి అవినీతి పద్ధతులను ఎలాగైనా ప్రోత్సహించడం నా గౌరవానికి చేటు. నీతిమాలిన, విలువైన వ్యవస్థకు ఇది హానికరం. అందుకే నేను ఫిల్మ్‌ఫేర్‌పై దావా వేయాలని నిర్ణయించుకున్నాను… ధన్యవాదాలు” అని ఆమె కంగనా సంచలన ప్రకటన చేసింది.

ఈ ఏడాది తలైవి చిత్రానికి గానూ కంగనా ఉత్తమ నటిగా కైరా అద్వానీ, కృతి సనన్, పరిణీతి చోప్రా, తాప్సీ పన్ను, విద్యాబాలన్‌లతో పాటు నామినేట్ అయింది. రాజ్ అర్జున్ సినిమాలోని ఆమె సహనటుడు కూడా ఉత్తమ సహాయ నటుడి విభాగంలో నామినేట్ అయ్యారు. నీతా లుల్లా మరియు దీపాలి నూర్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో నామినేషన్ పొందారు. యునిఫై మీడియా ఉత్తమ వీఎప్ఎక్స్ విభాగంలో నామినేట్ పొందింది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ మాత్రమే కాదు.. లతా మంగేష్కర్‌కు ఇన్ మెమోరియం నివాళులు అర్పించనప్పుడు కంగనా ఆస్కార్, ఎమ్మీలను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. “అంతర్జాతీయమని చెప్పుకునే ఈ ఆస్కార్ నిర్వాహకులు కూడా వారి జాతి లేదా సిద్ధాంతాల కారణంగా లెజెండరీ కళాకారులను విస్మరించి, ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టే ఏవైనా స్థానిక అవార్డులకు వ్యతిరేకంగా మేము బలమైన వైఖరిని తీసుకోవాలి… ఆస్కార్ మరియు గ్రామీ రెండూ భారతరత్న లతా మంగేష్కర్ జీకి నివాళులు అర్పించడంలో విఫలమయ్యాయి… గ్లోబల్ అవార్డులుగా చెప్పుకునే ఈ పక్షపాత స్థానిక ఈవెంట్‌లను మీడియా పూర్తిగా బహిష్కరించాలి…’’ అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసింది. “మేము ఈ స్నూటీ వెస్ట్రన్ అవార్డులను బహిష్కరించాలి” అని కూడా రాసింది. ఇప్పుడు దేశంలో ఇచ్చే ఫిల్మ్ ఫేర్ అవార్డులపై ఆరోపణలు చేయడం సంచలనమైంది.