Homeఎంటర్టైన్మెంట్God Father Teaser: ‘గాడ్ ఫాదర్’ టీజర్ టాక్: ‘గాడ్ ఫాదర్’ చిరంజీవితో కలిసి సల్మాన్...

God Father Teaser: ‘గాడ్ ఫాదర్’ టీజర్ టాక్: ‘గాడ్ ఫాదర్’ చిరంజీవితో కలిసి సల్మాన్ ఖాన్ చింపేశాడు!

God Father Teaser: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆయన నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. బాలవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ పాత్రలో నటించిన ఈ చిత్రం టీజర్ అదిరిపోయేలా ఉంది. ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత చిరంజీవి పూర్తి పొలిటికల్ యాంగిల్ లో మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రిమేక్ గా ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో నయనతారా, సత్యదేవ్ లాంటి మెప్పించే నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తికావస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. రేపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా టీజర్ ను విడుదల చేసి అభిమానులకు మంచి ట్రీట్ అందించారు.

20 ఏళ్లకు ఎక్కడికి వెళ్లాడో తెలియదు.. సడెన్ గా తిరిగివచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటూ హీరో క్యారెక్టర్ గురించి చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

ఇక పొలిటికల్ లీడర్ గా సత్యదేవ్ చాలా ఆవేశపూరితంగా నటించాడు. చివర్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బైక్ ఎంట్రీ.. చిరంజీవితో కలిసి జీపులో గోడ బద్దలు కొట్టిన సీన్లు టీజర్ లో హైలెట్ అని చెప్పొచ్చు. వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ సల్మాన్ గురించే అని అర్థమవుతోంది.

కథ ప్రకారం.. ఈ సినిమాలో చిరంజీవికి వెన్నుదన్నుగా ఉండే పాత్రలో సల్మాన్ ఖాన్ నటించినట్టు తెలుస్తోంది. చిరంజీవికి బాడీగార్డ్ లాంటి పాత్ర ఇది అని అర్థమవుతోంది. సినిమా మొత్తం ఆయన ఉండరని.. ఒక యాక్షన్ సీన్ లో వచ్చి మాయం అవుతారని అంటున్నారు.

టీజర్ చూస్తే చిందరవందరగా మారిపోయిన రాష్ట్ర రాజకీయాలను మార్చేందుకు 20 ఏళ్లు అజ్ఞతంలోకి వెళ్లిపోయిన నేత మళ్లీ వచ్చి బాగు చేస్తాడని.. అతడిని హతమార్చేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలను తుత్తినయలు చేసి చిరంజీవి ఎలా రాష్ట్ర రాజకీయాలను ఏలాడన్నది అర్థమవుతోంది. మరి మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి.

చిరంజీవి సతీమణి సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు. తమన్ సంగీతం అందించారు.
Recommended Videos
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ || Chiranjeevi Birthday Special || #HBDMegastarChiranjeevi
మెగాస్టార్ పై అభిమానం చాటుకున్న సత్యదేవ్ || MEgastar Chiranjeevi Brithaday Celbretions In Vijayawada
అశ్వని దత్ చెక్కిన శిల్పాలు వీళ్ళు | Who is behind the hit track of Vyjayanthi Movies | Ashwini Dutt

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version