Pragya Jaiswal: అందం అభినయం ఉండి కూడా ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో వెనకబడిపోయారు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. కనీసం టైర్ టూ హీరోల పక్కన కూడా అవకాశాలు రావడం లేదు.

డేగ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ దర్శకుడు క్రిష్ కంటిలో పడ్డారు.ఆయన కంచె మూవీలో అవకాశం ఇచ్చాడు. దర్శకుడు నమ్మకాన్ని నిలబెడుతూ ప్రగ్యా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రగ్యా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Also Read: Pawan Kalyan Hari Hara Veeramallu: అదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి పండగే..!

అనంతరం శ్రీ వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం చిత్రాలు చేశారు. ఇవన్నీ వరుసగా డిజాస్టర్స్ లిస్ట్ లో చేరాయి. దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో చేసిన జయ జానకి నాయక మాత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ పాత్ర చేశారు. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు రాలేదు.

అనూహ్యంగా ఆమె ఖాతాలో అఖండ రూపంలో భారీ హిట్ పడింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా గత ఏడాది విడుదలైన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రూ. 120 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ నిర్మాతలతో పాటు బయ్యర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది.

అంత పెద్ద హిట్ దక్కినా ప్రగ్యాకు అవకాశాలు మెరుగు పడలేదు. అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటికి దక్కడంతో ప్రగ్యాను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె లేటెస్ట్ రిలీజ్ సన్ ఆఫ్ ఇండియా ఆల్ టైం డిజాస్టర్ కాగా… కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది.
అయితే సోషల్ మీడియా వేదికగా అమ్మడు గ్లామర్ షోతో మెరుపులు మెరిపిస్తుంది. ఆమె స్కిన్ షో మైండ్ బ్లాక్ చేస్తుండగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. దర్శక నిర్మాతలకు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది . గ్లామర్ రోల్స్ కి సిద్ధమని హింట్ ఇస్తుంది. తాజాగా పలుచనైన బాడీ కాన్ డ్రెస్ లో ప్రగ్యా మెస్మరైజ్ చేసింది.
Also Read: NTR- Amit Shah: టీడీపీ, ఎల్లో మీడియాలో కలకలం రేపుతోన్న జూనియర్ ఎన్టీఆర్


