కరోనా భయంతో జనం వణికిపోతుంటే.. కంగనా రనౌత్ మాత్రం కరోనాను వణికించిందట. ఈ హాట్ బ్యూటీ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కంగనా రనౌత్, స్టార్ హీరోలను తన కామెంట్లతో భయపెట్టినట్టే, కరోనాని కూడా భయపెట్టినట్టు ఉంది. మొత్తానికి కరోనా ఆమె నుండి దూరంగా పారిపోయింది. మొత్తమ్మీద జెడ్ స్పీడ్ గా కరోనా నుండి ఈ అమ్మడు కోలుకుంది.
కంగనా రనౌత్ కి మే 9న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమెకి కరోనా నెగిటివ్ వచ్చింది. అంటే కేవలం 9 రోజుల్లోనే కరోనా నుండి పూర్తిగా కోలుకుంది. కరోనా అనేది ‘చిన్న రోగం’ అంటూ గతంలో పేర్కొన్న కంగనా, ఇప్పుడు కూడా అలాంటి కామెంట్సే మళ్ళీ చేసింది. కంగనా మాటల్లోనే “నేను ఈ మహమ్మారిని ఎలా జయించానో నాకు రాయాలని ఉంది.
అయితే, కరోనా వైరస్ ఫ్యాన్ క్లబ్స్ కు ఎలాంటి ఇబ్బందలు కలిగించొద్దు అంటూ నాకు సలహా ఇచ్చారు. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే కరోనా వైరస్ గురించి అగౌరవంగా మాట్లాడితే బాధపడేవాళ్లు కూడా మన సమాజంలో కొందరున్నారు” అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో కంగనా రాసుకొచ్చింది. ఇక ఎప్పటిలాగే ఆమె కామెంట్స్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
నిజానికి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతూ ఉంది .ఇలాంటి పరిస్థితుల్లో కంగనా ఇలా తన పైత్యం చూపించడం మంచి అనిపించుకోదు. నిజంగా కంగనా చెప్పినట్టుగానే కరోనా వైరస్ ‘చిన్నది’ అనుకుంటే.. మరి ఇంతమంది జనం ఎందుకు అల్లాడి పోతున్నారు, నేటికీ ఎందుకు వందల మంది చనిపోతున్నారు ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తరువాత కంగనా, తన శైలి కామెంట్స్ అండ్ పోస్ట్ లు పెడితే బెటర్.