Kangana Ranaut : హీరోయిన్లను ఎంజాయ్ చేసింది చాలు.. ఇక రిటైర్ అయిపో.. కరణ్‌ జోహార్ పై కంగనా ఫైర్..!

కంగనా రనౌత్ పోస్ట్ వైరల్ గా మారింది. చాలా కాలంగా కంగనా రనౌత్ బాలీవుడ్ లోని నెపోటిజం కి వ్యతిరేకంగా పోరాడుతుంది. కరణ్ జోహార్, మహేష్ భట్, అలియా భట్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ అంటే విరుచుకు పడుతుంది. ఒక మాఫియా పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళను తొక్కేస్తుందని ఆమె ఆరోపణ.

Written By: NARESH, Updated On : July 30, 2023 12:17 pm
Follow us on

Kangana Ranaut : సందు దొరికితే చాలు కరణ్ జోహార్ పై విరుచుకుపడుతుంది కంగానా రనౌత్. తాజాగా ఆయన్ని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసింది. కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని విడుదలైంది. ఈ మూవీలో రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించారు. మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా పెద్దగా వసూళ్లు రాబట్టలేదు. ఫస్ట్ డే కేవలం రూ. 11 కోట్ల వసూళ్లు దక్కాయి. ఈ క్రమంలో కంగనా రనౌత్ కరణ్ జోహార్ ని ఎద్దేవా చేశారు.

జనాలు పిచ్చోళ్ళు కాదు చెత్త సినిమాలు చూడటానికి. మూడు గంటల నిడివి ఉన్నా కూడా ఓపెన్ హైమర్ వంటి కంటెంట్ ఉన్న సినిమాలు చూస్తారు. కరణ్ జోహార్ నువ్వు మారలేదు. 90లలో చేసిన ట్రిక్స్ ఇంకా ప్లే చేస్తున్నావు. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సెట్స్, కాస్ట్యూమ్స్ అంతా ఫేక్. కాపీ సినిమాలు చేయడానికి సిగ్గు లేదా. ఈ అత్తా కోడలు డ్రామాకు రూ. 250 కోట్లు ఖర్చు చేశారా? టాలెంట్ ఉన్న చాలా మందిని పక్కన పెట్టేసి వీళ్ళ కోసం వందల కోట్లు అనవసరంగా కుమ్మరిస్తున్నారు.

కరణ్ జోహార్ నువ్వు పరిశ్రమలో అమ్మాయిలను వాడుకుంది చాలు. డబ్బులు వేస్ట్ చేసుకోకు. చిత్ర పరిశ్రమ నుండి వెళ్ళిపో. సినిమాలు మానేసేయ్. నువ్వేదో పెద్ద నిర్మాత అనుకుంటున్నావు. అంత సీన్ లేదు. నీ పని అయిపోయింది. రణ్వీర్ సింగ్ కి నేనిచ్చే సలహా ఒకటే… కరణ్ జోహార్ తో తిరగడం మానెయ్. అతన్ని ఫాలో అవ్వొద్దు. కరణ్ జోహార్ వలె బట్టలు వేసుకోకు. వినోద్ ఖన్నా, ధర్మేంద్ర మాదిరి బట్టలు వేసుకో. లేదంటే సౌత్ హీరోలను చూసి నేర్చుకో. నీ వస్త్రధారణ భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుంది, అని ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.

కంగనా రనౌత్ పోస్ట్ వైరల్ గా మారింది. చాలా కాలంగా కంగనా రనౌత్ బాలీవుడ్ లోని నెపోటిజం కి వ్యతిరేకంగా పోరాడుతుంది. కరణ్ జోహార్, మహేష్ భట్, అలియా భట్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ అంటే విరుచుకు పడుతుంది. ఒక మాఫియా పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళను తొక్కేస్తుందని ఆమె ఆరోపణ.