Homeఎంటర్టైన్మెంట్కిరణ్ రావు గాయంపై మంట పెడుతున్న కంగనా!

కిరణ్ రావు గాయంపై మంట పెడుతున్న కంగనా!

Kangana Ranautపాపం తనకు ‘అమీర్ ఖాన్’ విడాకులు ఇస్తున్నాడనే బాధతో కిరణ్‌ రావు లోలోపలే కుమిలిపోతూ ఉన్నా, పైకి మాత్రం అమీర్ కోసం నవ్వుతూ విడాకుల గురించి పాజిటివ్ కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి ఆమెది. అందుకే, కిరణ్‌ రావు తన బాధను నాలుగు గోడల మధ్యే అణిచివేసుకుంటూ ఆవేదన చెందుతూ ఉంది. కిరణ్‌ రావుకు అమీర్ చేసిన గాయం తాలూకు పచ్చి వాసన ఇంకా పోకముందే, కంగనా ఆ గాయం పై మంట పెట్టే ప్రయత్నం చేస్తోంది.

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ గా తనకు తానే బిరుదు ఇచ్చుకుని అడ్డమైన బూతులు మాట్లాడే కంగనా రనౌత్, తాజాగా కిరణ్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసి.. ఆమెకు మరింత బాధను మిగిల్చింది. ఇంతకీ కంగనా చేసిన కామెంట్స్ ఏమిటంటే.. ‘కిరణ్‌ రావు, అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఆమె ముస్లింగా మారిపోయారు ? మతాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన మతం మారాలా ?

అసలు తన కుమారుడిని కిరణ్‌ రావు ఎందుకు ఒక హిందువుగా పెంచలేక పోయింది ? ఒక తల్లి తన మతాన్ని మర్చిపోయి తన పిల్లలను ఇతర మతాల్లో ఎందుకు పెంచాలి ? అంత అవసరం ఏముంది ? అమీర్ ఖాన్ తో పెళ్లి అయినంత మాత్రాన ఆమె ఇలా ప్రవర్తించడం ఏమిటి ? మతం మారాల్సిన అవసరం ఎంత మాత్రాన లేకపోయినా కిరణ్ రావు ఉత్సాహంగా ఆ పని చేశారు’ అంటూ కంగనా తనకు మాత్రమే సాధ్యమయ్యే అభిప్రాయాన్ని బాహాటంగా వ్యక్తం చేసింది.

తనకు ఏ మాత్రం సంబంధం లేని ఈ విషయం పై కంగనా ఎందుకు కామెంట్స్ చేసింది అంటే.. ఈ మధ్య వివాదానికి ఏది దొరకడం లేదు. విమర్శలు చేయడానికి ఎవరు దొరకడం లేదు. దాంతో కంగనా ఆకలితో ఉన్న పులిలా కొన్ని రోజుల నుండి ఆశగా ఎదురు చూస్తూ ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో మిస్టర్ పర్ఫెక్ట్ కూల్ గా తన సతీమణితో సహా వీడియో ముందుకు వచ్చి, తన విడాకుల వ్యవహారాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు. కామెంట్స్ చేయడానికి కంగనాకి మంచి కంటెంట్ ఇచ్చాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version