రాంకీ సంస్థలపై ఐటీ దాడులు: వైసీపీలో కలకలం

రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ కావడమే కాకుండా అక్కడ పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఆయన అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో దాదాపు 20 బృందాలతో సోదాలు సాగిస్తున్నారు. రాంకీ గ్రూపు సంస్థల కార్యాలయాలతోపాటు హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. రాంకీ గ్రూప్ ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తోంది. వేస్ట్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. గచ్చిబౌలిలో రాంకీ సంస్థప్రధాన […]

Written By: Raghava Rao Gara, Updated On : July 6, 2021 6:57 pm
Follow us on

రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ కావడమే కాకుండా అక్కడ పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఆయన అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో దాదాపు 20 బృందాలతో సోదాలు సాగిస్తున్నారు. రాంకీ గ్రూపు సంస్థల కార్యాలయాలతోపాటు హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.

రాంకీ గ్రూప్ ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తోంది. వేస్ట్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. గచ్చిబౌలిలో రాంకీ సంస్థప్రధాన కార్యాలయం ఉంది. అక్కడ కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కంపెనీ జరిపిన కొనుగోలు, అమ్మకాల్లో తేడాలున్నట్లు గుర్తించారు. పన్ను ఎగ్గొట్టేందుకు నకిలీ ఇన్వాయిస్ లు తయారు చేశారని తెలుస్తోంది.

వైసీపీ వ్యూహకర్తల్లో ఒకరైన అయోధ్య రామిరెడ్డికి ఐటీ గురి పెట్టడంతో చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ పెద్దల లావాదేవీల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారనే పేరుంది. సోదాల్లో మరో కీలకమైన అంశం ఉందని చెబుతున్నారు. ఇటీవల రాంకీ షేర్స్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో సెబీ విచారణ చేయాలని ఐటీ డిపార్ట్ మెంట్ ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. షేర్ల ధరలు పెరగడం వెనుక ఉన్న స్కాంను ఐటీ వెలికి తీసేందుకే ఈ దాడులు చేసినట్లు చెబుతున్నారు.

అయితే ఐటీ దాడులు జరిపిన సోదాల్లో ఏదైనాలింకులు దొరికితే అవి ఇతర ప్రముఖులకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో8 కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తున్న వైసీపీ తమపార్టీ నేతలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడకుండా జాగ్రత్తలు పడుతున్నా అనూహ్యంగా ఇలాంటి దాడులు జరగడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.