https://oktelugu.com/

Kangana Ranaut: సౌత్ లోకి రాబోతున్న కంగనా మూవీ

Kangana Ranaut: బాలీవుడ్ లో వివాదాల హీరోయిన్ ‘కంగనా రనౌత్’ అంటేనే చాలా మందికి కోపం, కొంతమందికి పగ. కంగనాను ఎలాగైనా టార్చర్ పెట్టాలని హిందీ సినీ ప్రముఖులలో కొందరు ఇప్పటికీ కలలు కంటూ ఉన్నారు. అందుకే కంగనాకి సంబంధించి ప్రతి వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘ధాకడ్’. కాగా ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 1, 2022 / 02:43 PM IST
    Follow us on

    Kangana Ranaut: బాలీవుడ్ లో వివాదాల హీరోయిన్ ‘కంగనా రనౌత్’ అంటేనే చాలా మందికి కోపం, కొంతమందికి పగ. కంగనాను ఎలాగైనా టార్చర్ పెట్టాలని హిందీ సినీ ప్రముఖులలో కొందరు ఇప్పటికీ కలలు కంటూ ఉన్నారు. అందుకే కంగనాకి సంబంధించి ప్రతి వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘ధాకడ్’.

    Kangana Ranaut

    కాగా ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని నిజానికి గత ఏడాది అక్టోబర్ 1న విడుదల చేయాల్సింది. కానీ కరోనా వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఈ క్రమంలో నిర్మాతలు కొత్త డేట్‌ను ప్రకటించారు. మే 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు.

    Also Read:   బాలీవుడ్‌లో భీమ్లానాయ‌క్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ కార‌ణం వ‌ల్లే లేట్ అయిందంట‌

    ఏది ఏమైనా ఈ వివాదాల హీరోయిన్ అంటేనే బాలీవుడ్ కి భయం. ఎప్పుడు ఎవరిని తిడుతుందో అని స్టార్ హీరోల సైతం కంగనా నోరు చూసి భయపడుతూ ఉంటారు. తోటి నటీనటులు అందరూ కంగనా చేతిలో తిట్లు తిన్నవారే. అయితే, ఈ వివాదాల రాణి తాజాగా ‘లాక్ అప్’ షో చేస్తోంది. బిగ్ బాస్ షోని పోలిన లాక్ అప్ షో సరికొత్తగా రూపొందించారు.

    Kangana Ranaut

    డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో విరామం లేకుండా నిరంతరం ఈ షో ప్రసారం కానుంది. అయితే, కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ లాక్ అప్ షో ప్రసారం నిలిపి వేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. షో కాన్సెప్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సనోబర్ బేగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సిటీ సివిల్ కోర్టు.. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో షో ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేసింది.

    Also Read: బాలీవుడ్‌లో భీమ్లానాయ‌క్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ కార‌ణం వ‌ల్లే లేట్ అయిందంట‌

    Tags