Prabhas Salaar: ప్రభాస్ ‘సలార్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Prabhas Salaar: పాన్ ఇండియా డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ పాన్ ఇండియా సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ నటించబోతుందని తెలుస్తోంది. కాగా వచ్చే షెడ్యూల్ లో […]

Written By: Raghava Rao Gara, Updated On : April 25, 2022 4:28 pm
Follow us on

Prabhas Salaar: పాన్ ఇండియా డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ పాన్ ఇండియా సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ నటించబోతుందని తెలుస్తోంది. కాగా వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా సాంగ్ షూటింగ్ శరవేగంగా జరగనుంది.

Prabhas Salaar

అందుకే, ప్రస్తుతం సలార్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేశాడు. అన్నట్టు మూడు వారాల పాటు ఈ ‘సలార్’ కొత్త షెడ్యూల్ జరగనుంది. ఇక ఈ షెడ్యూల్ అంతా విలన్ డెన్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ సాంగ్ తర్వాత విలన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ కోసం ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ భారీ సెట్ ను కూడా నిర్మించింది. ఈ సెట్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు.

ఈ సెట్ ప్రభాస్ తో పాటు శృతి హాసన్ కూడా పాల్గొనబోతుంది. అందుకే ఈ సెట్ ను పలు విధాలుగా చెక్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేస్తున్నాడు అనగానే.. ‘సలార్’ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ పూర్తి అయ్యాక, సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో తర్వాత షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

Prabhas in Salaar

రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారట. ఇప్పటికే అక్కడ భారీగా సెట్స్ కూడా వేశారు. ప్రభాస్ ప్రస్తుతం కేవలం ఈ సినిమా కోసమే బల్క్ డేట్స్ కేటాయించాడు. అనంతరం ఆడిపురుష్ బ్యాలెన్స్ పార్ట్ ను పూర్తి చేస్తాడట.

Tags