
అదీ విషయం.. వివాదాల ఐటమ్ బాంబ్ ‘కంగన రనౌత్’ నిర్మాత అవతారం ఎత్తబోతుంది. పైగా తన సినిమా నిర్మాణ సంస్థకు ‘మణికర్ణిక ఫిలిమ్స్’ అనే మంచి నేమ్ ను కూడా పెట్టుకుని నిర్మాణ రంగంలోకి దిగబోతుంది. హీరోయిన్ గా ఉన్నప్పుడే తోటి నటీనటులు ఆమె చేతిలో పచ్చి తిట్లు తిన్నారు. ఇక మరి ఆమెగారు నిర్మాతగా మారితే ఆ బూతుల స్థాయికి పరిధులు ఉంటాయో ఉడతాయో తెలీదు.
ఇంతకీ నిర్మాతగా ఆమె ఎలాంటి సినిమాలు చేస్తోందో ? అని మహిళా లోకానికి ఒక అనుమానం పట్టుకుంది. మాములు సినిమాల్లోనే ఘాటు ముద్దులతో హద్దులు చెరిపేసినా ఒక హీరోయిన్.. ఇక ఏకంగా నిర్మాతగా మారితే బోల్డ్ సన్నివేశాల్లో కుటుంబ ప్రేక్షకులకు రక్తకన్నీరు పడుతుందేమో అని ఫ్యామిలీస్ భయపడుతున్నాయి. అయితే, తన సినిమాల విషయంలో కంగనా పిచ్చ క్లారిటీ ఇచ్చింది. తాను అందరిలా చెత్త సినిమాలు తీయదు అట.
మరి ఏంటి ఓన్లీ బూతు సినిమాలే తీస్తోందా అని మీరు అనుకోవచ్చు. ఒకవిధంగా అవే తీస్తోంది. ఎందుకంటే కంగనా దృష్టిలో బూతుకి అర్ధం వేరు. కాబట్టి ఆమెలోని బూతును తన చిత్రాల్లో ఉండేలా స్పష్టంగా ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి, డీసెంట్ ఆడియన్స్ అని చాటి చెప్పుకునే బాపతు ఉన్నవారంతా.. దయచేసి కంగనా సినిమాలకు దూరంగా ఉండండి. ఆత్రుత పడి, సినిమా ఓపెన్ చేసి, చూడాల్సిన తంతంగం అంతా చూసేసి చివర్లో అరెరే ఏంటి ఇది ఇలా ఉంది అని బాధ పడొద్దు.
ఇక కంగనా తన నిర్మాణంలో మొట్టమొదటిగా ఓటిటిల కోసం సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తుందట. తన నిర్మాణ సంస్థ లోగోని కూడా గ్రాండ్ గానే ఆవిష్కరించింది. ఇంతకీ నిర్మాతగా ఆమె ఫస్ట్ సినిమా ఏమిటంటే.. “టికు వెడ్స్ షేరు”. పేరు వింటేనే కంగనా అభిరుచి తెలిసిపోతుంది. ఇక ఇది ఒక సెటైరికల్ కామెడీతో కూడిన ప్రేమ కథ అట. అన్నట్టు తన సంస్థ ద్వారా కంగనా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుందట.