Kanchana movie re release collections: ఈ మధ్య కాలంలో కొన్ని రీ రిలీజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నత రేంజ్ లో సక్సెస్ కాకపోవడం తో, రీ రిలీజ్ ట్రెండ్ కి ముగింపు సమయం వచ్చేసిందని అంతా అనుకున్నారు. మహేష్ బాబు అతడు, ప్రభాస్ మున్నా సినిమాలను రీసెంట్ గానే రీ రిలీజ్ చేయగా, ఆ రెండు చిత్రాలకు కనీసం ప్రింట్ ఖర్చులు కూడా రాలేదు. అయితే నేడు రాఘవ లారెన్స్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన ‘కాంచన’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. దీనికి ఎవ్వరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య కాలం లో కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 2 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, థియేటర్స్ లో కచ్చితంగా చూడాలని అనిపించే సినిమాలను ఆడియన్స్ అసలు మిస్ అవ్వరు, బ్రహ్మరథం పడుతారు అని. కాంచన చిత్రం లోని హారర్ ఎలిమెంట్స్ ని టీవీ లో చూస్తే కిక్ రాదు. కచ్చితంగా థియేటర్స్ లో చూస్తేనే అసలు సిసలు కిక్ ఉంటుంది. అందుకే ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. పైగా సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బాగా డల్ ఆయిపోయింది. విడుదలైన కొన్ని కొత్త సినిమాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ‘కాంచన’ సినిమా విడుదల అవ్వడం, థియేటర్స్ కి మంచి ఫీడింగ్ దొరికినట్టు అయ్యింది.
Also Read: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..’ఉస్తాద్ భగత్ సింగ్’ కి లైన్ క్లియర్.. ఫ్యాన్స్ కి ఇక పండగే!
మరో వారం రోజుల వరకు థియేటర్స్ లోకి కొత్త సినిమా వచ్చే పరిస్థితి లేనందున , ఈ చిత్రానికి కలెక్షన్స్ దంచి కొట్టేసేలా ఉన్నాయి. ముక్యముగా నైజాం , సీడెడ్ , ఉత్తరాంధ్ర ప్రాంతాలలో సంక్రాంతి తర్వాత థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ నడుస్తుండడం జరిగింది ఈ చిత్రానికే. ఇదే ఊపు కొనగిస్తూ పోతే ఈ చిత్రం కచ్చితంగా టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా గబ్బర్ సింగ్ కొనసాగుతుండగా, ఫుల్ రన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా మహేష్ బాబు ఖలేజా చిత్రం నిలిచింది. ఈ రెండు రికార్డ్స్ ని కాంచన అందుకుంటుందో లేదో చూడాలి.
