https://oktelugu.com/

Kamal Hasan: 66 ఏళ్ల వయసులో ఫ్యాషన్ వ్యాపారం చేయనున్న కమల్

Kamal Hasan: నటనలో కమల్ హాసన్ మించినవారు ఉండరనే చెప్పుకోవాలి. ఎవరినైనా ఉద్దేశించి కమల్ హాసన్ నటనను మించిపోయారు కదరా అంటూ ఉంటారు. అంత గొప్ప నటుడు కమల్ హాసన్ ఏ పాత్ర లో ఉన్న తన నటనతో ఒదిగి పోగలరు కమల్ హాసన్. ఈ లోకనాయకుడు విభిన్నమైన నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తారు.రాజకీయాలు అస్సలు పడవన్న ఆయనే.. తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు.రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగలడంతో ఆయన తిరిగి సినిమాల్లో ప్రయాణం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 22, 2021 / 02:21 PM IST
    Follow us on

    Kamal Hasan: నటనలో కమల్ హాసన్ మించినవారు ఉండరనే చెప్పుకోవాలి. ఎవరినైనా ఉద్దేశించి కమల్ హాసన్ నటనను మించిపోయారు కదరా అంటూ ఉంటారు. అంత గొప్ప నటుడు కమల్ హాసన్ ఏ పాత్ర లో ఉన్న తన నటనతో ఒదిగి పోగలరు కమల్ హాసన్. ఈ లోకనాయకుడు విభిన్నమైన నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తారు.రాజకీయాలు అస్సలు పడవన్న ఆయనే.. తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు.రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగలడంతో ఆయన తిరిగి సినిమాల్లో ప్రయాణం సాగించాలి అనుకుంటున్నారు. తమిళ ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో విజయవంతంగా ఐదో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

    కమల్ హాసన్ ప్రస్తుతం సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు ‘మాస్టర్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హీరోగా ‘విక్రమ్’ అనే సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ చిత్రాన్ని పున:ప్రారంభించడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నారు. 66 ఏళ్ల వయసులో కమల్ ఫ్యాషన్ బిజినెస్‌లోకి అడుగు పెట్టనున్నారు. ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ పేరుతో కమల్ కొత్త బ్రాండును ఫ్యాషన్ ప్రియులకు పరిచయం చేయబోతున్నారు.ఇందులో ఒక మంచి ఉద్దేశం ముడి పడి ఉందనే చెప్పాలి.నైపుణ్యం ఉన్న ఆర్థికంగా బలపడలేకపోతున్న చేనేత కార్మికులకు అండగా నిలిచే ప్రయత్నం.

    ఈ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆరంభించేది భారతదేశంలో కాదు. అమెరికాలోని చికాగో అనే ప్రాంతంలో ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ తొలి దుకాణాన్ని కమల్ ప్రారంభించు ఉన్నారట. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమృత రామ్ డిజైన్లతో తొలి స్టార్ ఆరంభం కానుంది. అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా అందమైన దుస్తులను అందించబోతున్నామని,ఖాదీని నగర యువతకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ బ్రాండ్ మొదలుపెడుతున్నామని కమల్ ప్రకటించాడు. భారత్‌లోనూ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ స్టోర్లు తెరవడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నారట .