Natyam Telugu Movie Review:
నటీనటులు: సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, బేబీ దీవన తదితరులు
దర్శకుడు: రేవంత్ కోరుకొండ
నిర్మాతలు: నిశ్రింకళ ఫిల్మ్
సంగీత దర్శకుడు:శ్రవణ్ భరద్వాజ్
ఎడిటర్: రేవంత్ కోరుకొండ
రేటింగ్ : 2.25

ఆమె ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి.. పేరు సంధ్యారాజు. పైగా ఆమె కుటుంబ నేపథ్యం కూడా చాలా పెద్దది. అలాంటి ఆమె కేవలం ‘నాట్యం’ పై ప్రేమతో తానే స్వయంగా నటించి, నిర్మించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
నాట్యం అనే గ్రామంలో ఒక్కప్పుడు అద్భుత నర్తకి కాదంబరి అనే నాట్యకర్త నాట్యం కోసం జీవితాన్ని త్యాగం చేస్తోంది. ఆమె గురించి సితార (సంధ్యారాజు) చిన్నతనంలోనే తెలుసుకుంటుంది. అలా ఆ కాదంబరి కథ పై ఆసక్తితో నాట్యం నేర్చుకుంటుంది. తన నాట్య రంగ ప్రవేశంలో కాదంబరి కథను తన నాట్యం ద్వారా ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అయితే, ఆమె జీవితంలోకి రోహిత్ (రోహిత్ బెహల్) వస్తాడు. అతని రాకతో ఆమె జీవితంలో అనేక సంఘటనలు జరుగుతాయి ? ఇంతకీ సితార జీవితంలో చోటు చేసుకున్న ఆ సంఘటనలు ఏమిటి ? చివరకు ఆమె కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పుకుంటే.. నాట్యం పై వచ్చిన ఇదొక ఎమోషనల్ డ్రామా. నమ్మకాలు, మూఢ నమ్మకాల వల్ల, మరియు చిన్నపాటి స్వార్ధాల వల్ల చరిత్రను ఎంత దారుణంగా వక్రకరిస్తారో కరెక్ట్ గా చూపించిన సినిమా ఇది. ‘సితార’గా సంధ్యారాజు అద్భుతంగా నటించారు. మెయిన్ గా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మరియు క్లైమాక్స్ లో ఆమె నటన చాల బాగుంది.
అలాగే హీరో పాత్రలో నటించిన రోహిత్ బెహల్ కూడా చాలా బాగా నటించాడు. కమల్ కామరాజు కూడా హరి పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆదిత్య మీనన్, మదర్ క్యారెక్టర్ పోషించిన భానుప్రియ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక శుభలేఖ సుధాకర్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్ :
సంధ్యారాజు నటన,
సినిమా నేపథ్యం,
సంగీతం,
రియలిస్టిక్ డ్రామా
మైనస్ పాయింట్స్ :
ప్లాష్ బ్యాక్ లో వచ్చే డ్రామా,
ఇంట్రెస్టింగ్ సాగని స్టార్టింగ్ సీన్స్,
స్లో నేరేషన్,
సినిమా చూడాలా ? వద్దా ?
ఒకసారి చూడోచ్చు. కాకపోతే సినిమాలో చూపించిన ఎమోషనల్ కంటెంట్ ఈ డిజిటల్ ప్రపంచంలో బయట ఎక్కడా కనిపించక పోవచ్చు. కాబట్టి, ఈ అంశంలో ప్రేక్షక మహాశయుల చూసి చూడనట్టు పోతే.. ఈ సినిమా నచ్చుతుంది.