https://oktelugu.com/

Bharateeyudu 2: రక్తపు రంగులో కమల్ హాసన్ షాకింగ్ లుక్.. భారతీయుడు 2′ నుంచి క్రేజీ అప్ డేట్

Bharateeyudu 2: గ్రేట్ డైరెక్టర్ శంకర్ గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో రానున్న ‘భారతీయుడు 2’కి మొదటి నుండి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. వాటిని దాటుకుని భారతీయుడు ముందుకు వచ్చాడు. హీ ఈజ్ బ్యాక్ అంటూ భారతీయుడు 2 మళ్లీ మొదలు కాబోతున్నాడు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ఒక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో పాటు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో భారతీయుడు […]

Written By:
  • Shiva
  • , Updated On : August 24, 2022 / 11:52 AM IST
    Follow us on

    Bharateeyudu 2: గ్రేట్ డైరెక్టర్ శంకర్ గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో రానున్న ‘భారతీయుడు 2’కి మొదటి నుండి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. వాటిని దాటుకుని భారతీయుడు ముందుకు వచ్చాడు. హీ ఈజ్ బ్యాక్ అంటూ భారతీయుడు 2 మళ్లీ మొదలు కాబోతున్నాడు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ఒక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో పాటు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో భారతీయుడు 2 లుక్ ను కూడా రివీల్ చేసింది. ఈ లుక్ లో కమల్ హాసన్ వెరీ పవర్ ఫుల్ గా కనిపించి షాక్ ఇచ్చారు.

    kamal haasan

    రక్తపు రంగులో ఉన్న ఎర్రటి పోస్టర్ లో వైట్ అండ్ వైట్ గెటప్ అండ్ సెటప్ లో కమల్ హాసన్ అదిరిపోయారు. ఈ లుక్ లో కమల్ ను అలా చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సారి ఇక భీభత్సమే అంటూ లైక్స్ అండ్ షేర్లతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూట్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అయితే, ఆ మధ్య సెట్లో పెద్ద క్రేన్ పడి శంకర్ అసిస్టెంట్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు కూడా చనిపోయిన తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి తెలిసిందే.

    Also Read: Bollywood Hope Liger Movie: అమీర్, అక్షయ్ ముంచేశారు… బాలీవుడ్ ఆశలన్నీ విజయ్ ‘లైగర్’ పైనే!

    అయితే త్వరలో జరగబోయే షూట్ ఫస్ట్ డే రోజు చనిపోయిన వారికి నివాళి అర్పించి.. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేసి.. షూట్ స్టార్ట్ చేస్తారట. ఇక ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమా నుండి ఓ యువనటి తప్పుకుందట. ఆమెది భారతీయుడు సీక్వెల్ లో కీలక పాత్ర అని, అందుకే ఆమె పాత్రలో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ హీరోయిన్ శ్రుతి శర్మను తీసుకున్నారని తెలుస్తోంది.

    Bharateeyudu 2

    కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్లో జరనున్న వచ్చే షెడ్యూల్ లో శ్రుతి శర్మ కూడా షూట్ లో పాల్గొంటుందట. ఇక కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు కేటాయించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ కూడా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్ కూడా భారతీయుడు 2లో ఓ కామిక్ పాత్ర పోషిస్తున్నాడు.

    యువ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2023లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ సినిమాని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ సినిమానైనా అటు కమల్ కి ఇటు శంకర్ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

    Also Read:Surekha Vani: బాగా డబ్బులున్న బాయ్ ఫ్రెండ్ కావాలి… మనసులో కోరిక పచ్చిగా బయటపెట్టిన సురేఖా వాణి

     

     

    Tags