Kamal Haasan Suriya Karthi: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరిలో లోకేష్ కనకరాజ్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకొని దానికి కమర్షియల్ అంశాలను జోడిస్తూ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఆ కథను చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇక ఇదే తరహాలో ఆయన మొదటి నుంచి కూడా ఇలాంటి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన కార్తీ ని హీరోగా పెట్టి చేసిన ‘ఖైదీ ‘ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమా తమిళ్, తెలుగు రెండు భాషల్లో సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయన వరుసగా లోకేష్ యూనివర్స్ అనే ఒక యూనివర్స్ ను ఏర్పాటు చేసుకొని అందులోనే సినిమాలను చేస్తు వస్తున్నాడు.
ఇక ఈ యూనివర్స్ లో ఉన్న హీరోలందరిని ఒకానొక టైమ్ లో కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే విక్రమ్ సినిమా ద్వారా కమలహాసన్ ను కూడా ఈ యూనివర్స్ కి పరిచయం చేశారు. అలాగే ఆయన క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేశారు. ఇక ఈ సినిమా చివర్లో సూర్యను ‘రోలెక్స్’ అనే ఒక విలన్ పాత్రలో చూపించి ఆయన్ని కూడా ఈ యూనివర్స్ లో భాగం చేయబోతున్నాడు అనే విషయాన్ని మనకు చెప్పకనే చెప్పాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఖైదీ సినిమాలో డిల్లీ (కార్తీ), రొలెక్స్ (సూర్య)లమధ్య భీకరమైన పోటీ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మధ్యలో కమలహాసన్ కూడా వీళ్ల తోపాటు జాయిన్ అవ్వబోతున్నాడు. ఇక వీళ్ళ ముగ్గురి మధ్యలో కథ నడవబోతున్నట్టుగా తెలుస్తుంది. రోలెక్స్ మాత్రం కమలహాసన్, కార్తీ ఇద్దరి మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంటాడట…ఇక అదే విధంగా కమలహాసన్ కార్తీ ఇద్దరు కలిసి రొలెక్స్ ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని పడగొట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంటారు.
ఈ ప్రాసెస్ లో కమలహాసన్, కార్తీ కలిసి రొలెక్స్ పాత్రని అంతం చేశారా లేదా అనే కథాంశం తో మరికొన్ని ట్విస్ట్ లలో ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం లొకేశ్ కనకరాజ్ రజనీకాంత్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకులకైతే మంచి అంచనాలు ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగా ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి… ఇక ఈ సినిమా తర్వాత ఖైదీ 2 ను పట్టలెక్కిస్తాడట…