CM YS Jagan : ఏపీ సీఎం జగన్ బయటకు వచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. రెండు రోజుల కిందట జగన్ పై గులకరాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. విజయవాడ సింగ్ నగర్ సమీపంలో ఆయనపై దాడి జరిగింది. అయినా సరే బస్సు యాత్రను ఆయన కొనసాగించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకున్నారు.దీంతో ఆదివారం బస్సు యాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ప్రస్తుతం సీఎం జగన్ పై దాడి హాట్ టాపిక్ గా మారింది. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు నుంచి బస్సు యాత్రను జగన్ పునః ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గంలో బస్సు యాత్ర ప్రారంభం అయ్యింది.
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సీఎం జగన్ పై దాడి సంచలనం గా మారింది. అయితే ఈరోజు బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో.. దీనిపైనే జగన్ సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. దాడి తరువాత తొలిసారి జగన్ ప్రజల్లోకి వచ్చారు. కేసరపల్లిలో యాత్ర ప్రారంభమైన తర్వాత.. వంద మీటర్ల పరిధిలో రెండు సార్లు బస్సు నుంచి బయటకు వచ్చిన జగన్ ప్రజలకు అభివాదం చేశారు. నేరుగా వారి సమస్యలను వినే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం బస్సు యాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మోహన్ ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీకి బలమైన నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. ప్రధాన రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి.
అయితే జగన్ చలాకీగా కనిపిస్తున్నారు. ఆయనకు తగిలిన గాయానికి సంబంధించి వాపు ఇంకా తగ్గలేదు. అక్కడ తెల్లటి బ్యాండేజ్ కనిపిస్తోంది. మరోవైపు దాడి జరిగిన తర్వాత.. జగన్ ఉల్లాసంగా కనిపిస్తుండటం విశేషం. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున సీనియర్లు జగన్ ను పరామర్శించారు. గాయం గురించి ఆరా తీశారు. అయితే తాను సేఫ్ గా బయటపడ్డానని జగన్ చెప్పుకొచ్చారు. బస్సుయాత్ర ప్రారంభం కావడంతో వైసిపి శ్రేణుల్లో సైతం జోష్ నెలకొంది. జగన్ బయటకు వచ్చిన సమయంలో వీడియోలు, ఫోటోలను వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది. బస్సు యాత్ర తిరిగి ప్రారంభమైందని.. కాస్కోండి అంటూ పోస్టులు పెడుతోంది. వీటిని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బయలుదేరిన సీఎం జగనన్న#MemanthaSiddham #EndOfTDP #YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/Fr75YtwD0u
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) April 15, 2024