https://oktelugu.com/

Admissions: విద్యార్థులకు కీలక సూచన.. లాస్ట్ డేట్ మిస్ కాకండి

మార్చి 15న నోటిఫికేషన్‌ ఇచ్చిన సొసైటీ దరఖాస్తులకు నెల రోజులు గడువు ఇచ్చింది. ఆ గడువు సోమవారంతో ముగియనుంది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 15, 2024 / 12:19 PM IST

    Ts Gurukula Degree Admissions 2024-2025

    Follow us on

    Admissions:  రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 15తో ముగియనుంది. మార్చి 15న నోటిఫికేషన్‌ ఇచ్చిన సొసైటీ దరఖాస్తులకు నెల రోజులు గడువు ఇచ్చింది. ఆ గడువు సోమవారంతో ముగియనుంది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు. సాయంత్రం 5 గంటల వరకు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

    వీరు అర్హులు..
    ఇక గురుకుల సొసైటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్‌ పూర్తి చేసినవారు అర్హులు. ఈ విద్యాసంవత్సరం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

    రాత పరీక్ష..
    ఇక దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్‌ 28న రాత పరీక్ష నిర్వహిస్తారు. టీఎస్‌ఆర్‌డీసీ సెట్‌–2024 పేరిట ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 21 తర్వాత హాల్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. దరఖాస్తు దారులు డౌన్‌లోడ్‌ చేసుకుని టీఎస్‌ఆర్‌డీసీ సెట్‌ రాయవచ్చు.

    అన్నీ ఉచితమే..
    ఇక గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు విద్యతోపాటు, భోజనం, వసతి, యూనిఫామ్స్, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ ఉచితంగా అందిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ గురుకులం పరిధిలో 15 బాలుర, 15 మహిళా డిగ్రీ కళాశాలలు, ఎస్సీ గురుకులంలో 26 మహిళా కాలేజీలు, ఎస్టీ గురుకులంలో 6 బాలుర, 15 మహిళా కళాశాలలున్నాయి. ఆయా కాలేజీల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీహెచ్‌ఎంసీటీ, బీఎఫ్‌టీ సహా పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ కోర్సులో 40 సీట్లు ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.