Kamal Haasan-Rajinikanth Multistarrer Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వీరిద్దరూ కే బాలచందర్ డైరెక్షన్లో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. కెరియర్ మొదట్లో ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. అయితే వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహమైతే ఉంది. అందువల్లే ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోట్ చేస్తూ ఆ సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఎవరికి వారు సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో చాలా రోజుల నుంచి రజినీకాంత్ – కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని తమ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘విక్రమ్ ‘ సినిమాతో కమల్ హాసన్ కి అదిరిపోయే సక్సెస్ ని అందించిన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వీళ్ళిద్దరూ కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. కానీ రీసెంట్ గా రజనీకాంత్ తో లోకేష్ చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనే డైలమాలో అయితే ఉన్నారు.
కానీ మొత్తానికి అయితే రీసెంట్ గా ఒక అవార్డుల ఫంక్షన్ కి హాజరైన కమల్ హాసన్ తను రజనీకాంత్ కలిసి నటిస్తున్నానని మేమిద్దరం కలిసి సినిమా చేస్తున్నామంటూ చెప్పాడు. చాలా రోజుల కిందట మేమిద్దరం కలిసి ఒక బిస్కెట్ ని హాఫ్ చేసుకుని తినేవాళ్ళమని ఇక ఆ తర్వాత ఎవరి బిస్కెట్ వాళ్లు తింటున్నామని ఇప్పుడు మరోసారి ఆఫ్ బిస్కెట్ ని తినడానికి ఇద్దరం రెడీ అయ్యామంటూ ఆయన విచిత్రమైన కథనైతే చెప్పాడు.
మరి ఏది ఏమైనా కూడా రజనీకాంత్ – కమలహాసన్ కాంబినేషన్లో సినిమా వస్తే బిజినెస్ పరంగా చాలా భారీ బిజినెస్ అయితే జరుగుతోంది. ఇక దానికి తగ్గట్టుగానే సినిమా మీద హైప్ కూడా విపరీతంగా పెరుగుతోంది. తద్వారా వీళ్ళ అభిమానులు సైతం ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక వాళ్లందర్నీ సంతోష పెట్టడానికి వీళ్లిద్దరూ ఇప్పుడు నటించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజు ఏనా లేదంటే వేరేవాళ్లెవరైన ఈ సినిమా చేస్తున్నారా అనే విషయాలను తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతోంది అనే విషయం మీద క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది…