https://oktelugu.com/

Actor Dhanush: ఇంటరెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ధనుష్… తెలుగు లో ఫస్ట్ మూవీ

Actor Dhanush: చిత్ర పరిశ్రమలో ఉన్న వెర్సటైల్ హీరోల జాబితాలో టాలెంటెడ్ హీరో ధనుష్ పేరు కూడా ఖచ్చితంగా నిలుస్తుంది. ఎలాంటి పాత్రలో అయినా కూడా ఇమిడిపోయే ధనుష్ మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు ఆ సినిమా అనౌన్సమెంట్ ని మేకర్స్ ప్రకటించారు. కోలివుడ్‌ స్టార్‌ ధనుష్‌ తొలి తెలుగు సినిమా టైటిల్‌ వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘సార్‌’ అని నామకరణం చేసినట్లు మేకర్స్‌ […]

Written By: , Updated On : December 23, 2021 / 02:50 PM IST
Follow us on

Actor Dhanush: చిత్ర పరిశ్రమలో ఉన్న వెర్సటైల్ హీరోల జాబితాలో టాలెంటెడ్ హీరో ధనుష్ పేరు కూడా ఖచ్చితంగా నిలుస్తుంది. ఎలాంటి పాత్రలో అయినా కూడా ఇమిడిపోయే ధనుష్ మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు ఆ సినిమా అనౌన్సమెంట్ ని మేకర్స్ ప్రకటించారు. కోలివుడ్‌ స్టార్‌ ధనుష్‌ తొలి తెలుగు సినిమా టైటిల్‌ వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘సార్‌’ అని నామకరణం చేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు. తమిళంలో ‘వాతి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఆసక్తికర మోషన్ టీజర్ తో ఈ సినిమాకి “సార్” అనే టైటిల్ ని రివీల్ చేశారు. అలాగే ఇందులోనే ఈ సినిమా లో కంటెంట్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో అనేది కూడా రివీల్ చేసే యత్నం చేశారు.

actor dhanush first telugu movie title announced by makers

ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా నాగవంశీ మరియు సాయి సౌజన్య లు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. అలానే టాలెంటడ్ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ సంగీతం అందివ్వనున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాలను తెలియజేస్తూ మేకర్స్‌ ఓ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. కాగా ధనుష్‌ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రానికి కమిట్ అయిన విషయం తెలిసిందే.