Kamal Haasan Birthday: కమల్ హాసన్ పరిపూర్ణమైన నటుడు. ఫ్యాషన్ ఉన్న గొప్ప డాన్సర్, యాక్టర్. స్టార్డం అనే పరిధులు దాటి సినిమాలు చేశారు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా విలక్షణమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలు చేశారు. ఈ క్రమంలో అనేక జయాపజయాలు ఎదురయ్యాయి. కమల్ హాసన్ దర్శకుడు, నిర్మాత, సింగర్ కూడాను. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కోసం శరీరాన్ని కూడా మార్చుకునే నటుడు. బాలనటుడిగా మొదలైన ఆయన ప్రయాణం ఎన్నో శిఖరాలు తాకింది.
1954 నవంబర్ 7న జన్మించిన కమల్ హాసన్ నేడు 69వ ఏట అడుగుపెట్టారు. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. కమల్ హాసన్ ఆస్తుల వివరాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. కమల్ హాసన్ కి చెన్నై లో రెండు ఇళ్ళు ఉన్నాయి. వీటి విలువ రూ. 19 నుండి 20 కోట్లు. అలాగే చెన్నై నగరంలో ఆయనకు కమర్షియల్ ల్యాండ్స్, ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటి విలువ రూ. 92.5 కోట్లని అంచనా.
అలాగే లండన్ లో కమల్ హాసన్ కి ఓ ఇల్లు ఉంది. దాని విలువ రూ. 2.5 కోట్లని సమాచారం. కమల్ హాసన్ వద్ద రెండు బీఎండబ్యూ బ్రాండ్ కి చెందిన 730 LD, లెక్సస్ ఎల్ఎక్స్ 570 కార్లు ఉన్నాయట. వీటి ధర రూ. 3.69 కోట్లు అట. టయోటా ప్రడో, మిస్టిబుషి పజెరో, మెర్సిడెజ్ బెంజ్ E 220 కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్ తో పాటు, ఆడి A 8ఎల్ కార్లు ఉన్నాయి. వాటి ధర రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
కొంత వ్యవసాయ భూమి కూడా కమల్ హాసన్ కలిగి ఉన్నారు. ఆయనకు రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ప్రభుత్వానికి కమల్ హాసన్ సమర్పించిన వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 177 కోట్లు. విక్రమ్ మూవీతో ఆయన ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు. శంకర్ తో భారతీయుడు 2 చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ టైటిల్ తో ఒక మూవీ ప్రకటించారు.