https://oktelugu.com/

మహేష్ బాబు, మామ కృష్ణ సాయం అడగకుండా ఎదిగాను

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలిన సూపర్‌‌స్టార్‌‌ అతనికి మామయ్య.. నేటి సూపర్‌‌స్టార్‌‌ మహేశ్‌ బాబు స్వయానా బావా. ఇంకే వారి పరపతి.. పలుకుబడిని వాడుకొని ఇండస్ర్టీలోకి వచ్చి ఎదగొచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ.. యాక్టర్‌‌ సుధీర్‌‌బాబు అలా చేయలేదు. తన కెరీర్‌‌ను తానే సొంతంగా నిర్మించుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. అనుకున్నట్లుగానే తనకంటూ ప్రత్యేక ఈమేజీని సొంతం చేసుకున్నాడు. Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. ! నటుడు సుధీర్‌‌బాబు 2006లో కృష్ణ కూతురు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2020 4:47 pm
    sudheer babu

    sudheer babu

    Follow us on

    sudheer babu

    ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలిన సూపర్‌‌స్టార్‌‌ అతనికి మామయ్య.. నేటి సూపర్‌‌స్టార్‌‌ మహేశ్‌ బాబు స్వయానా బావా. ఇంకే వారి పరపతి.. పలుకుబడిని వాడుకొని ఇండస్ర్టీలోకి వచ్చి ఎదగొచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ.. యాక్టర్‌‌ సుధీర్‌‌బాబు అలా చేయలేదు. తన కెరీర్‌‌ను తానే సొంతంగా నిర్మించుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. అనుకున్నట్లుగానే తనకంటూ ప్రత్యేక ఈమేజీని సొంతం చేసుకున్నాడు.

    Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. !

    నటుడు సుధీర్‌‌బాబు 2006లో కృష్ణ కూతురు ఘట్టమనేని ప్రియదర్శిణిని పెళ్లి చేసుకున్నాడు. 2010లో ‘ఏ మాయె చేశావె’ సినిమా కెరీర్‌‌ ప్రారంభించిన సుధీర్‌‌బాబు.. అందులో సమంతకు సోదరుడిలా యాక్ట్‌ చేశాడు. 2012లో ‘శివ మనసులో శ్రుతి’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. తదుపరి ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’, ‘భలే మంచి రోజు’, ‘బాఘి’, ‘సమ్మోహనం’, ‘నన్ను దెచుకుందువటే’ తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

    ఇటీవల వచ్చిన ‘వి’ సినిమాలోనూ తన పాత్ర అందరినీ మెప్పించాడు. అయితే.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా సుధీర్‌‌ బాబు ఇటీవల ఓ ఇంగ్లిష్‌ చానల్‌తో మాట్లాడారు. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి అమ్మాయిని భార్యగా చేసుకోగా.. అత్తింటి గురించి ప్రత్యేకంగా చెప్పారు. ‘ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు వారికి కూడా చెబుతుంటా. కానీ.. చివరికి నా ఆలోచనల ప్రకారమే ప్రాజెక్టుకు సంతకం చేస్తా. నాకు నచ్చిన వారితో పనిచేస్తుంటా. మామయ్య, మహేశ్‌ ఇచ్చిన సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుంటా. ఒక్కోసారి నా నిర్ణయాలతో ఫెయిల్‌ అయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ స్వయంగా చేసిన తప్పుల వల్ల నేర్చుకునే పాఠం అందంగా ఉంటుంది’ అని చెప్పారు.

    Also Read: హిట్ కొట్టలేకపోయినా.. స్పీడ్ మాత్రం తగ్గట్లేదు !

    ‘అంతేకాదు.. నేను మామయ్య, మహేశ్‌ దగ్గరికి వెళ్లి వారి ముందు నా పేరు సిఫార్సు చేయండి అని ఇప్పటివరకు అడగలేదు. నా సినిమాను నిర్మించండి, గైడ్‌ చేయండి అని కూడా ఎప్పుడూ కోరలేదు. నటుడ్ని కాకముందు నేను సినిమాలను పంపిణీ చేసేవాడిని. దీంతో ఆ రంగంపై అంతోఇంతో అవగాహన ఉంది. కొంత మంది ఫ్రెండ్స్‌ కూడా నన్ను ప్రోత్సహించారు. నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా ఎవరి సహాయం తీసుకోలేదు. మామయ్య, మహేశ్‌ సాయం తీసుకుంటే పెళ్లి చేసుకున్నందుకు కట్నం తీసుకున్నట్లే అవుతుందని భావించా. నిజానికి మా ఫ్యామిలీ పురుగుల మందుల తయారీ బిజినెస్‌ చేస్తుంటుంది. అందులో నుంచి పక్కకు రావాలనే ఉద్దేశంతోనే నేను ఫిల్మ్‌ ఇండస్ర్టిలోకి అడుగుపెట్టా’ అని వివరించారు.