Kalyan Ram- NTR: బాలయ్యను కాదని తమ్ముడు ఎన్టీఆర్ కి సప్పోర్ట్ చేసిన కళ్యాణ్ రామ్!

బాలయ్య-ఎన్టీఆర్ లకు ఒకరంటే మరొకరికి గిట్టదు. గత పదేళ్లలో చాలా అరుదుగా వేదికలు పంచుకున్నారు. పబ్లిక్ లో సాన్నిహిత్యం నటించడమే కానీ మనస్సుల్లో పెద్ద అగాధమే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మా రక్తం కాదని నమ్మే నందమూరి వర్గం కూడా ఉంది. అసలు ఎన్టీఆర్ స్టార్ కాకపోతే నందమూరి ఫ్యామిలీ అతన్ని లెక్కలో నుండి తీసేసేది. ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య కుమారుడు. ఆమెది వేరే సామాజిక వర్గం. బాలయ్యతో ఎన్టీఆర్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తుండగా అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రం సన్నిహితంగా ఉంటూ వచ్చారు.

Written By: Shiva, Updated On : May 27, 2023 9:57 am
Follow us on

Kalyan Ram- NTR: నందమూరి కుటుంబంలో విభేదాలున్నాయన్నది నిజం. రాజకీయ ఆధిపత్యం దీనికి కారణమైంది. సీనియర్ ఎన్టీఆర్ మరణంతో టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు హస్తగతమైంది. ప్రారంభంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు టీడీపీలో సముచిత స్థానం లభించింది. మెల్లగా టీడీపీలో బాలకృష్ణకు ప్రాధాన్యత పెరిగి హరికృష్ణకు తగ్గింది. బాలయ్య-బాబు వియ్యంకులు అయ్యారు. అదే సమయంలో హరికృష్ణ వారిద్దరికీ కామన్ ఎనిమీ అయ్యారు. తండ్రితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా టీడీపీలో గౌరవం దక్కలేదు. 2009 నుండి టీడీపీ కార్యక్రమాలను ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు.

బాలయ్య-ఎన్టీఆర్ లకు ఒకరంటే మరొకరికి గిట్టదు. గత పదేళ్లలో చాలా అరుదుగా వేదికలు పంచుకున్నారు. పబ్లిక్ లో సాన్నిహిత్యం నటించడమే కానీ మనస్సుల్లో పెద్ద అగాధమే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మా రక్తం కాదని నమ్మే నందమూరి వర్గం కూడా ఉంది. అసలు ఎన్టీఆర్ స్టార్ కాకపోతే నందమూరి ఫ్యామిలీ అతన్ని లెక్కలో నుండి తీసేసేది. ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య కుమారుడు. ఆమెది వేరే సామాజిక వర్గం. బాలయ్యతో ఎన్టీఆర్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తుండగా అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రం సన్నిహితంగా ఉంటూ వచ్చారు.

ఎన్టీఆర్ హాజరుకాని పలు నందమూరి, నారా ఫ్యామిలీ ఈవెంట్స్ కి కళ్యాణ్ రామ్ హాజరయ్యారు. ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ రోల్ చేశాడు. తాతయ్య బయోపిక్ లో మీరు నటించాల్సింది కదా జూనియర్ ఎన్టీఆర్ అని అడిగితే… ఎన్టీఆర్ బయోపిక్ చేసే అర్హత ఎవరికీ లేదు. నాకు కూడా లేదు. ఆయన లెజెండ్, ఎవరూ తాతయ్య పాత్రకు న్యాయం చేయలేరని చెప్పాడు. అది పరోక్షంగా బాలయ్యకు చురక వేసినట్లు అయ్యింది. బాలయ్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్స్ డిజాస్టర్స్ అయ్యాయి. ఉచితంగా చూడంటి అంటూ థియేటర్స్ ముందు బోర్డ్స్ పెట్టినా ఎవరూ వెళ్ళలేదు.

అన్నదమ్ములు ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ బాబాయ్ బలయ్ విషయంలో భిన్నమైన ధోరణి కలిగి ఉన్నారు. కళ్యాణ్ రామ్ కలిసేందుకు ఇష్టపడతారు. ఎన్టీఆర్ మాత్రం దూరం పెడతారు. అయితే తాతయ్య ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల విషయంలో విషయంలో బాలయ్యను కాదని కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వైపు నిలిచాడు. జూనియర్ ఎన్టీఆర్ తాను హాజరుకావడం కుదరదని ప్రకటించిన నేపథ్యంలో కళ్యాణ్ రామ్ సైతం బహిష్కరించారు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ కూడా బాలయ్యకు దూరం అవుతున్నాడనిపిస్తుంది. ఆయన పంథా మారిందని తెలుస్తోంది.