Kalyan Dev: ‘సూపర్ మచ్చి’ ట్రైలర్ కు కనెక్ట్ అయిన ఫ్యాన్స్..!

Kalyan Dev Super Machi Trailer: మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం ‘సూపర్ మచ్చి’. ఈ మూవీలో కల్యాణ్ దేవ్ కు జోడిగా కన్నడ బ్యూటీ రచితా రామ్ నటిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటంతో ‘సూపర్ మచ్చి’ని సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజు చేసేందుకు మూవీ మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేసుకుకున్నారు. ఈమేరకు జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ‘సూపర్ మచ్చి’ రిలీజు అవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ మూవీ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 12, 2022 2:36 pm
Follow us on

Kalyan Dev Super Machi Trailer: మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం ‘సూపర్ మచ్చి’. ఈ మూవీలో కల్యాణ్ దేవ్ కు జోడిగా కన్నడ బ్యూటీ రచితా రామ్ నటిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటంతో ‘సూపర్ మచ్చి’ని సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజు చేసేందుకు మూవీ మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేసుకుకున్నారు. ఈమేరకు జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ‘సూపర్ మచ్చి’ రిలీజు అవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ‘సూపర్ మచ్చి’ ట్రైలర్ ను విడుదల చేశారు. 126 సెకన్ల నిడివితో విడుదల అయిన  ‘సూపర్ మచ్చి’ ట్రైలర్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఈ ట్రైలర్ ను పరిశీలిస్తే..  లవ్ అండ్ యాక్షన్, ఎమోషన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ఇందులో కల్యాణ్ దేవ్ చాలా స్టైలీయిష్ గా కన్పించారు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య లవ్ సీన్స్, డైలాగ్స్ అన్నింటిని దర్శకుడు పులి వాసు ట్రైలర్లో అద్భుతంగా చూపించారు.

‘చూడకుండానే ప్రేమించుకోవడం’.. ‘వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సీతవు అవుతావో లేదో నాకు తెలియదు గానీ.. వాడు మాత్రం రాముడు అవుతాడమ్మా..’ అనే డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. కల్యాణ్ దేవ్ ను ప్రేమిస్తున్నట్లు రచితా రామ్ వెంటపడే సన్నివేశాలు బాగున్నాయి.

ఈ మూవీలో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్,  నటి ప్రగతి, నరేష్, పోసాని కృష్ణ మురళీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని రిజ్వాన్ ఎంటర్‌ టైన్ మెంట్ బ్యానర్లో రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మించారు.  ‘సూపర్ మచ్చి’ ట్రైలర్ అభిమానులతో సూపర్ గా ఉందని అనిపించుకుంటోంది.