Balakrishna: బాలయ్య బాబు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న సినిమా థియేటర్ల సమస్యల పై, అలాగే టికెట్ రేట్ల పై తొలిసారి స్పందిస్తూ తనదైన శైలిలో మాట్లాడారు. బాలయ్య మాటల్లోనే.. ‘సినిమా అనేది ఇప్పుడొక నిత్యావసరం అయిపోయింది. రేట్లు అందుబాటులో ఉండడం సమంజసమే అనిపించుకుంటుంది. అయితే, కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. టికెట్ రేట్లతో ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుంది, కాబట్టి తగు నిర్ణయం తీసుకోవాలి’ అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు.
అయితే, సినిమా టికెట్ల పై జగన్ సర్కార్ ఆలోచించాలి అంటూనే.. బాలయ్య తన అఖండ సినిమా అఖండమైన విజయం గురించి మాట్లాడారు. మరి ఏ మాట్లాడాడో బాలయ్య మాటల్లోనే.. ‘మా అఖండ సినిమా గురించి నేడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. నిజానికి మా అఖండ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా’ అంటూ బాలయ్య పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు.
Also Read: దొంగలతో జతకట్టినా కేసీఆర్ కు ప్రయోజనముండదు?
పనిలో పనిగా మరో భారీ మాట చెప్పాడు బాలయ్య. ‘పాకిస్తాన్ లో కూడా మా అఖండ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారట. ఈ విషయం గురించి నాకు ఎవరో వాట్సప్ చేశారు’ అంటూ బాలయ్య చెప్పాడు. మొత్తమ్మీద బాలయ్య తన పైత్యం మళ్ళీ చూపించాడు అన్నమాట. అన్నట్టు అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు సినిమాకు సహాయసహకారాలు అందించాలని బాలయ్య కోరాడు.
ఇక ‘అఖండ’తో భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఏది అయితే ఏం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చిన బాలయ్య తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా చాటుకున్నాడు. అసలు ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని.. ఈ సినిమా నిర్మాత కూడా ఊహించలేదు. కానీ రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Also Read: తగ్గేదే లే.. ఫెడరల్ ఫ్రంట్ ను వదలని కేసీఆర్.. ప్లాన్ మళ్లీ షురూ..!