https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘ఓట్ ఫర్ అప్పీల్’ టాస్కులో ప్రేరణ ప్రభంజనం..ఆడిన టాస్కులన్నిట్లోనూ గెలుపు..నిఖిల్ కి సైతం చుక్కలు చూపించిందిగా!

టవర్స్ ని కట్టే టాస్కులో ఆడేందుకు కంటెస్టెంట్స్ ని జట్టులుగా విడదీస్తాడు బిగ్ బాస్. గౌతమ్, నబీల్ ఒక జట్టు కాగా, నిఖిల్ ప్రేరణ, విష్ణు ప్రియ రోహిణి మరో రెండు జట్టులుగా కనిపిస్తారు. వీళ్ళ కాళ్లకు తాడు కట్టేయగా, ఇటుకలను వాళ్ళ వైపుకి తీసుకెళ్లి ఒకరు టవర్స్ ని నిర్మిస్తే మరొకరు, వాటిని చెడగొట్టేందుకు బాల్స్ విసరాలి. అలా చివరికి ఎవరి టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో, వాళ్ళు విజేతలుగా నిలిచి ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : December 4, 2024 / 08:10 AM IST

    Bigg Boss Telugu 8(261)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ కంటెస్టెంట్స్ లో ఆడపులిలా రెచ్చిపోయి టాస్కులు ఆడిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రేరణ మాత్రమే. యష్మీ కూడా ఈమెతో సమానంగా గేమ్స్ ఆడింది, మధ్యలో ఆమె ఆట గాడి తప్పింది. కానీ ప్రేరణ మాత్రం తనకి అవకాశం వచ్చినప్పుడల్లా నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ పెట్టింది. గెలుపు శాతం తక్కువే కానీ, ఆడాలనే కసి, మగవాళ్ళతో సమానంగా పోటీ పడే తత్త్వం ఆమెలోని నెగటివ్ యాంగిల్స్ ని కూడా కప్పేసేలా చేశాయి. అందుకే ఆమె ఎన్నోసార్లు దారుణంగా నోరు జారినప్పటికీ కూడా, ఆమెకి ఆడియన్స్ అండగా నిలబడ్డారు. ఇప్పుడు టాప్ 5 లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చింది ఈ క్యూట్ బ్యూటీ. అయితే నిన్న బిగ్ బాస్ హౌస్ లో ‘ఓట్ ఫర్ అప్పీల్’ టాస్కులను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రెండు టాస్కుల్లోనూ ప్రేరణనే విజయం సాధించింది.

    ముందుగా టవర్స్ ని కట్టే టాస్కులో ఆడేందుకు కంటెస్టెంట్స్ ని జట్టులుగా విడదీస్తాడు బిగ్ బాస్. గౌతమ్, నబీల్ ఒక జట్టు కాగా, నిఖిల్ ప్రేరణ, విష్ణు ప్రియ రోహిణి మరో రెండు జట్టులుగా కనిపిస్తారు. వీళ్ళ కాళ్లకు తాడు కట్టేయగా, ఇటుకలను వాళ్ళ వైపుకి తీసుకెళ్లి ఒకరు టవర్స్ ని నిర్మిస్తే మరొకరు, వాటిని చెడగొట్టేందుకు బాల్స్ విసరాలి. అలా చివరికి ఎవరి టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో, వాళ్ళు విజేతలుగా నిలిచి ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు. ఈ టాస్కులో ముందుగా నబీల్, గౌతమ్ టవర్ కూలిపోతుంది. ఆ తర్వాత విష్ణుప్రియ,రోహిణిల టవర్ పడిపోతుంది. ఇక చివరికి ప్రేరణ టవర్ ఒక్కటి మిగలడంతో, నిఖిల్ ప్రేరణ టీం తదుపరి టాస్కు ఆడేందుకు క్వాలిఫై అవుతారు. అలాగే విష్ణుప్రియ,రోహిణి జట్టు రెండవ స్థానంలో నిలుస్తారు కాబట్టి, వాళ్ళిద్దరితో ఒకరికి టాస్కు ఆడే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్.

    ఆ ఒకరు ఎవరు అనేది వీళ్లిద్దరు చర్చించుకొని బిగ్ బాస్ కి చెప్పుమనగా, విష్ణు ప్రియ తప్పుకొని రోహిణిని పంపుతుంది. ఆ తర్వాత ‘టకా టక్’ టాస్కుని ఆడేందుకు నిఖిల్, రోహిణి, ప్రేరణ వస్తారు. ఈ టాస్కులో మూడు కోర్టులు ఉంటాయి, అదే విధంగా అనేకమైన డిస్కులు కూడా ఉంటాయి. ముగ్గురు తమ డిస్కులను అవతల వాళ్ళ కోర్టు వైపుకి నెట్టాలి. ఎవరి కోర్టులో అయితే తక్కువ డిస్కులు ఉంటాయో, వాళ్ళు ఈ టాస్క్ విజేతలుగా నిలుస్తారు. ఇందులో కూడా ప్రేరణ విన్నర్ గా నిలుస్తుంది. ఈ టాస్కులో సంచాలక్ గా వ్యవహరించిన నబీల్ సరిగా చేయలేదని రోహిణి వాదిస్తుంది. ఇక్కడ చిన్న గొడవ అవుతుంది కానీ, అనుకున్నంత పెద్ద గొడవ మాత్రం అవ్వలేదు. అలా ఈ రెండు టాస్కులను గెలిచిన ప్రేరణ ఆడియన్స్ ని ఓటు అడిగేందుకు అర్హతని సంపాదిస్తుంది. ఈ టాస్కులతో ప్రేరణ గ్రాఫ్ బాగా పెరిగి ఉండొచ్చు.