Kalki Movie Trailer coming soon
Kalki Movie Trailer: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో లోనే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాను ఎలాగైనా సరే సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యం తో సినిమా మీద బజ్ పెరగడానికి ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. ఇక ప్రభాస్ వాహనమైన బుజ్జి(Bujji) వీడియోని రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలను తార స్థాయికి పెంచారు.
ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలైతే చేస్తున్నారు. ఇక ఈ సినిమాను జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. అయితే జూన్ 7వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూపించి మరోసారి సినిమా మీద అంచనాలను పెంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
Also Read: Nivetha Pethuraj: హీరోయిన్ నివేద పేతురాజ్ కారు డిక్కీలో శవం… అసలు నిజం వెలుగులోకి..!
ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇప్పటివరకు మంచి విజయాలను అయితే అందుకుంటూ వస్తున్నాయి. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా భారీ సక్సెస్ సాధించి 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టి ఈ సినిమా భారీ ప్రభంజనాన్ని సృష్టించినట్టు అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద 600 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించారు. మరి ఈ సినిమా రిలీజ్ అయి ఎన్ని వసూళ్లను కలెక్ట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read: Devara Fear Song: యూట్యూబ్ ని దున్నేస్తున్న దేవర ఫియర్ సాంగ్… ఎన్ని కోట్ల మంది చూశారో తెలుసా?
ఇక మొత్తానికైతే ప్రభాస్ ని భారీ స్థాయిలో వాడుకున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త ప్రయోగంగా మిగిలిపోతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక వీటన్నింటికి సమాధానం దొరకాలంటే ట్రైలర్ వస్తే ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ఒక అంచనా అయితే ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఈ సినిమా ట్రైలర్ కోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు…