https://oktelugu.com/

Nivetha Pethuraj: హీరోయిన్ నివేద పేతురాజ్ కారు డిక్కీలో శవం… అసలు నిజం వెలుగులోకి..!

Nivetha Pethuraj: నిన్న నివేద పేతురాజు కారును పోలీసులు పట్టుకున్నారు. ఆమె ఒంటరిగా డ్రైవ్ చేస్తూ ఎక్కడికో వెళుతున్నారు. అడ్డగించిన పోలీసులు... కారు చెక్ చేయాలి అన్నారు. కారు పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : May 31, 2024 / 07:44 PM IST

    Nivetha Pethuraj

    Follow us on

    Nivetha Pethuraj: నివేద పేతురాజ్ కారును పోలీసులు అడ్డగించిన సంగతి తెలిసిందే. ఆమె కారును తనిఖీ చేయాలని కోరగా నివేద నిరాకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళ్, తెలుగు భాషల్లో నివేదా పేతురాజ్ కి ఫేమ్ ఉంది. ఆమె మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో చిత్రంలో నివేద పేతురాజ్ సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. పలు తెలుగు సినిమాల్లో ఆమె హీరోయిన్, సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసింది. 
     
    నిన్న నివేద పేతురాజు కారును పోలీసులు పట్టుకున్నారు. ఆమె ఒంటరిగా డ్రైవ్ చేస్తూ ఎక్కడికో వెళుతున్నారు. అడ్డగించిన పోలీసులు… కారు చెక్ చేయాలి అన్నారు. కారు పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండని నివేద పోలీసులతో అన్నారు. పేపర్స్ అవసరం లేదు. కారు డిక్కీ ఓపెన్ చేయమని పోలీసులు ఆదేశించారు. అందుకు నివేద నిరాకరించింది. 
     
    కారు డిక్కీ ఓపెన్ చేసి సహకరిస్తే మా పని మేము చేసుకుంటామని పోలీసులు నివేదతో అన్నారు. కారు డిక్కీ ఓపెన్ చేయడం కుదరదు. ఇది పరువుకు సంబంధించిన మేటర్ అని నివేద చెప్పడంతో పోలీసులు మరింతగా అనుమానించారు. ఈ సంఘటన ఫోన్ కెమెరాలో రికార్డు చేస్తుండగా సీరియస్ అయిన నివేద… షూటింగ్ ని అడ్డుకుంది. నివేద అంత భయపడటానికి కారు డిక్కీలో ఏముంది? ఆమె ఏదైనా నేరం చేశారా? అనే సందేహాలు బలపడ్డాయి. 
     
    కట్ చేస్తే ఇదంతా ఫ్రాంక్. ఓ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా గేమ్ ప్లాన్ చేశారు. నివేద ప్రధాన పాత్రలో నటించిన ‘పరువు’ సిరీస్ జీ5లో జూన్ 14 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్లో హీరో హీరోయిన్ కారు డిక్కీలో ఓ శవాన్ని తరలిస్తారు. అందుకే ఈ రకమైన ఫ్రాంక్ చేశారు. ఈ మధ్య చాలా మంది చిన్న హీరోలు ఈ తరహా ఫ్రాంక్స్ చేస్తున్నారు. విశ్వక్ సేన్, అల్లరి నరేష్, నందు, బిగ్ బాస్ సన్నీ తమ ప్రాజెక్ట్స్ విడుదలకు ముందు ఇదే విధమైన ఫ్రాంక్స్ చేశారు. ఒక్కోసారి ఈ ఫ్రాంక్స్ విమర్శలకు దారి తీస్తున్నాయి.