Team India: 2023.. టీమిండియా వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వెళ్ళింది. ఆస్ట్రేలియాతో తలపడింది. ప్రపంచంలో ఉన్న అభిమానులందరి లాగే ఆమె కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఒక సెల్ఫీ వీడియోలో కమాన్ టీమ్ ఇండియా అంటూ.. ఎంకరేజ్ చేసింది. సీన్ కట్ చేస్తే టీమిండియా ఓడిపోయింది.
2023 అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని చెప్పేసింది. మూడోసారి కూడా గెలిచి కెసిఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ప్రకటించింది. కానీ కెసిఆర్ ఒక స్థానంలో ఓడిపోగా.. ఆయన పార్టీ అధికారానికి దూరమైంది.
ఇక 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని, గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటారని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కానీ 11 సీట్లకే జగన్ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది.
దీంతో ఆమె విషెస్ చెప్తే చాలు.. పార్టీ లేదా జట్టు సంకనాకి పోవడం ఖాయమని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆమె విషెస్ చెప్పలేదు. దీంతో టీమ్ ఇండియా గెలిచింది.. ఇదే విషయాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించింది. దీంతో సోషల్ మీడియాలో జనాలు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీనటిగా ఆమె అనేక చిత్రాల్లో నటించింది. తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత వైఎస్ఆర్సిపి కండువా కప్పుకుంది. నగరి ఎమ్మెల్యేగా గెలిచింది. 2019లో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రిగా జగన్ ప్రభుత్వంలో పని చేసింది. సహజంగానే దూకుడు స్వభావం ఎక్కువగా ఉన్న రోజా ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టేసినట్టు చెబుతుంది. అయితే ఆమె చెప్పిన విషయాలన్నీ విరుద్ధ ఫలితాలను ఇవ్వడంతో.. సోషల్ మీడియాలో అనేక విధాలుగా ట్రోల్స్ కు గురైంది..
2023 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా గెలుస్తుందని చెబితే ఓడిపోయింది. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెబితే.. అది కాస్త విరుద్ధమైన ఫలితాన్ని ఇచ్చింది. ఇక 2024లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెబితే.. ఇక్కడ కూడా నెగిటివ్ ఫలితమే వచ్చింది. దీంతో ఆమె పై వ్యతిరేక వ్యాఖ్యలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో టిడిపి, దాని అనుకూల గ్రూపులలో రోజా గురించి రకరకాల వ్యాఖ్యలు వినిపించేవి.. అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో రోజా టీమిడియాకు విషెస్ చెప్పలేదు. దీంతో టీమ్ ఇండియా కప్ దక్కించుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రోజా ప్రకటించింది.. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకునేందుకు.. రోజా సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయగా.. అలాంటి పోస్ట్ కనిపించలేదు. అంటే ఎవరో కావాలని ఆమె పేరు మీద పోస్ట్ క్రియేట్ చేసినట్టు అర్థమవుతోంది.. కాకపోతే ఆమె అంటే గిట్టని వాళ్లు ఈ పోస్టును సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తున్నారు..