https://oktelugu.com/

5..7.. సీటర్ కార్ల గురించి కానీ 8 సీటర్ కార్లు కూడా వస్తున్నాయని తెలుసా? వాటి ధర ఫీచర్లు ఇవే..

టయోటా కంపెనీకి చెందిన మరో కారు ఇన్నోవా హై క్రాస్.. 8 సీటర్ కారు రాబోతుంది. ఇన్నోవా గురించి ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. సెవెన్ సీటర్ కలిగిన ఈ కారు ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అయితే లేటెస్ట్గా 8 సీట్లతో రాబోతుంది. ఇది 2.0 పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. 173 బిహెచ్పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 17, 2024 / 05:18 PM IST

    8 seater car

    Follow us on

    భారత్లో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో వినియోగదారుల అభిరుచులు మారుతుండడంతో డిఫరెంట్ కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు ఉన్న కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.దీంతో 5 లేదా 7 సీట్ల కార్ల కు డిమాండ్ పెరిగిపోతుంది. అయితే లేటెస్ట్ గా 8 సీట్ల కార్లు కూడా రాబోతున్నాయి. అవి ఏ కంపెనీకి చెందినవో, వాటి ధర ఎంతో ఒకసారి చూద్దాం.

    మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి చాలామందికి తెలుసు. SUV కార్లను ఉత్పత్తి చేయడంలో ఈ కంపెనీ ముందుంటుంది. లేటెస్ట్ గా ఈ కంపెనీ నుంచి 8 సీట్ల కారు రాబోతుంది. దీనికి మహీంద్రా మరాజో అని పేరు పెట్టారు. ఇది ఎంపీ వి కారు. ఇందులో లేటెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో ఉన్న ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్, గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. దీనిని రూ 14.40 లక్షలు ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

    SUVలను మార్కెట్లోకి తీసుకు రావడంలో టయోటా సైతం తన ప్రత్యేకత చూపుతోంది. లేటెస్ట్ గా టయోటా ఇన్నోవా కృస్టా పేరుతో సెవెన్ సీటర్ తో పాటు 8 సీటర్ కారును కూడా తీసుకురాబోతుంది. ఇందులో 2.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఉండనుంది. అలాగే 148 బిహెచ్పి పవర్, 343 ఎమ్ ఎమ్ టార్క్ తో పనిచేయనుంది. దీనిని 19.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

    టయోటా కంపెనీకి చెందిన మరో కారు ఇన్నోవా హై క్రాస్.. 8 సీటర్ కారు రాబోతుంది. ఇన్నోవా గురించి ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. సెవెన్ సీటర్ కలిగిన ఈ కారు ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అయితే లేటెస్ట్గా 8 సీట్లతో రాబోతుంది. ఇది 2.0 పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. 173 బిహెచ్పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిని 19.82 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

    దేశంలోని కార్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మారుతి కంపెనీ సైతం 8 సీటర్ కారును తీసుకువస్తుంది. దీనికి ఇన్విక్టో అని పేరు పెట్టారు. ఇది 2.0 l పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇందులో 173 బిహెచ్పి పవర్ తో పాటు మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో పని చేయనుంది. దీనిని రూ.25.35 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.