https://oktelugu.com/

Kalki 2898 New Poster: కల్కి అప్డేట్: భైరవగా ప్రభాస్ లుక్ మైండ్ బ్లోయింగ్, కాశీ నగరంతో సంబంధం ఏమిటీ?

దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి చిత్ర ఫస్ట్ లుక్ విమర్శలపాలైంది. ఏదో తల అంటించినట్లు ఆర్టిఫిషియల్, మార్ఫ్డ్ ఫోటో వలె ఉందంటూ విమర్శలు వినిపించాయి.

Written By: , Updated On : March 8, 2024 / 05:35 PM IST
Prabhas as Bhairava in Kalki

Prabhas as Bhairava in Kalki

Follow us on

Kalki 2898: ప్రభాస్ కట్ అవుట్ కి తగ్గ పాత్రను గొప్పగా దర్శకుడు తీర్చిదిద్దాడని నేటి కల్కి అప్డేట్ తో అర్థం అవుతుంది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని నేడు కల్కి 2829 AD నుండి ప్రభాస్ పాత్రను పరిచయం చేశారు. ఆ పాత్ర పేరు తెలియజేస్తూ మరో లుక్ షేర్ చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి చిత్ర ఫస్ట్ లుక్ విమర్శలపాలైంది. ఏదో తల అంటించినట్లు ఆర్టిఫిషియల్, మార్ఫ్డ్ ఫోటో వలె ఉందంటూ విమర్శలు వినిపించాయి. దాంతో అధికారిక పేజీ నుండి డిలీట్ చేసి మరలా అప్డేట్ చేసి విడుదల చేశారు.

అనంతరం వచ్చిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. వీటన్నింటిలో నేడు పంచుకున్న లుక్ బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ లుక్ అటు మోడరన్, ఇటు పీరియాడిక్ గెటప్స్ మిక్స్ చేసి సరికొత్తగా ఉంది. ముడివేసిన జుట్టు. చేతికి నల్లని చారలు, కళ్ళకు ఏదో పరికరం ధరించి ఉన్నాడు. ఇక ‘భవిష్యత్ కాశీ స్ట్రీట్స్ నుండి భైరవ ను పరిచయం చేస్తున్నాం….’ అని పోస్టర్ లో కామెంట్ జోడించారు.

కాబట్టి కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ. ఈ పోస్టర్ ద్వారా మరో హింట్ కూడా ఇచ్చారు. ఫ్యూచర్ లో హిందువుల పుణ్యక్షేత్రం కాశీ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించనున్నారని తెలుస్తుంది. కల్కి చిత్ర కథతో కాశీ నగరానికి ఉన్న సంబంధం ఏమిటో తెలియాల్సి ఉంది. కల్కి మూవీలో హీరో కాలాల్లో ప్రయాణం చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించబోతున్నాము అని నాగ్ అశ్విన్ కూడా చెప్పారు.

నేటి పోస్టర్ తో కల్కి కథపై మరింత అవగాహన వచ్చింది. అదే సమయంలో నేడు విడుదలైన ప్రభాస్ లుక్ కి గతంలో వచ్చిన లుక్స్ లో తేడాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా శివరాత్రి రోజు ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ట్రీట్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు విడుదల కావాల్సి ఉండగా ఆలస్యం అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఆలస్యం అయినా అప్డేట్ సంతృప్తికరంగా ఉంది. కల్కి చిత్రంలో దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. మే 9న కల్కి విడుదల కానుంది.