Bigg boss telugu season 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 తేదీన మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో రెండో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు. బుల్లి తెర నటుడు అయిన నిఖిల్ సీరియల్స్ చేస్తూ.. తన కంటూ ఒక తెచ్చుకున్నాడు. అయితే కర్ణాటకు చెందిన ఇతను తెలుగులో పలు సీరియల్స్ లో నటించి ఈ ఛాన్స్ దక్కించుకున్నాడు. గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి వంటి సీరియల్స్ లో నటించాడు. అలాగే స్టార్ మా లో పలు షోల్లో కూడా పాల్గొన్నారు. అయితే అతను నటించిన మొదటి సీరియల్ హీరోయిన్ కావ్య తో అతను అప్పటి నుంచే ప్రేమలో ఉన్నట్లు బాగా రూమర్స్ వచ్చాయి. వీటికి తగ్గట్లుగానే వాళ్లు కూడా ప్రవర్తించారు. ఇద్దరు కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడపడం, రీల్స్ చేయడం, ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లడం వంటివి అన్ని చేశారు. అయితే వీళ్ళిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. అయితే ఇదే సమయంలో నిఖిల్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిఖిల్ బిగ్ బాస్ లోకి వెళ్లాడని.. తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. కానీ కావ్య మాత్రం నిఖిల్ కి సపోర్ట్ గా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అంటే వీళ్ల లవ్ ఇక ముగిసినట్టేనా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నిఖిల్ కి సపోర్ట్ చేస్తూ కావ్య ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టకపోవడం.. అలాగే నిఖిల్ కూడా హౌస్ లోపలికి వెళ్తూ సింగిల్ అని చెప్పాడు. నాగార్జున నువ్వు సింగిల్ హా కాదా అని అడిగితే.. ఇంతకు ముందు ప్రేమయాణం ఉండేది. కానీ ఇప్పుడు లేదు. సింగిల్ అని నిఖిల్ చెప్పి హౌస్ లోపలికి వెళ్లాడు. అయితే సోషల్ మీడియాలో కూడా నిఖిల్, కావ్య ఒకరికి ఒకరు అన్ ఫాలో చేసుకున్నారని వైరల్ అవుతుంది. దీంతో వీళ్ల ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఇలా జరగడం బాధాకరమని అంటున్నారు. అన్ని షోలకు కలిసి వెళ్లడం, బయట వేకెషన్స్ కి కూడా కలిసి వెళ్లడం వంటివి చేశారు. కానీ ఇంతలో ఇవన్నీ చూస్తుంటే.. కావ్యతో నిఖిల్ ప్రేమాయణం ఇక ముగిసినట్టే అనిపిస్తుంది. మరి వీళ్ల ఇద్దరి రిలేషన్ ఎలా ఉందో తెలియాలి అంటే ఎవరో ఒకరు నోరు విప్పితేనే తెలుస్తుంది. కావ్య అయితే ఇప్పటి వరకు ఎలా స్పందించలేదు. కనీసం ఎవరో ఒకరు స్పందిస్తే.. నిజం అబద్దం ఏంటో తెలుస్తుంది.