https://oktelugu.com/

Kalki 2898 AD: ‘కల్కి’ చిత్రంలో మనకు సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది ప్రభాస్ కాదా..? మొత్తం డూప్ ని వాడారా? వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో!

ఒక రోజు 'రాజా సాబ్' షూటింగ్ లో ఉన్నాడు అని వార్త వినిపిస్తే, రెండు రోజుల తర్వాత 'ఫౌజీ' మూవీ సెట్స్ లో ఉన్నాడని వార్త వినిపిస్తుంది. ఇలా ఉంటుంది ప్రభాస్ షెడ్యూల్. అందుకే కొన్ని ముఖ్యమైన సమయాల్లో ఆయన లేనప్పుడు కూడా డూప్స్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.

Written By:
  • Vicky
  • , Updated On : March 14, 2025 / 05:05 PM IST
    Kalki 2898 AD

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD: ఈమధ్య కాలం లో మేకర్స్ హీరోల మీద అధికంగా ఆధారపడకుండా బాడీ డబుల్స్ తో షూటింగ్స్ కానిచ్చేస్తున్నారు. బాడీ డబుల్ అంటే ‘యానిమల్'(Animal Movie) చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుంది. మన లాగే ఉండే మరో మనిషిని తీసుకొని రావడాన్ని బాడీ డబుల్ అంటారు. మీకు అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే డూప్ అని అనుకోవచ్చు. ఇది ఈమధ్య కాలం లో స్టార్ హీరోల సినిమాలకు మేకర్స్ అత్యధికంగా అనుసరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్(Rebel Star Prabhas) కి. ఈయన ఏకకాలం లో రెండు మూడు సినిమాలు చేస్తూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. ఒక రోజు ‘రాజా సాబ్’ షూటింగ్ లో ఉన్నాడు అని వార్త వినిపిస్తే, రెండు రోజుల తర్వాత ‘ఫౌజీ’ మూవీ సెట్స్ లో ఉన్నాడని వార్త వినిపిస్తుంది. ఇలా ఉంటుంది ప్రభాస్ షెడ్యూల్. అందుకే కొన్ని ముఖ్యమైన సమయాల్లో ఆయన లేనప్పుడు కూడా డూప్స్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.

    Also Read: దిల్ రూబా’ ఫుల్ మూవీ రివ్యూ…

    ఇది కేవలం ప్రభాస్ కి మాత్రమే కాదు, టాలీవుడ్ దాదాపుగా అందరి స్టార్ హీరోల సినిమాలకు జరిగేదే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ‘ఓజీ'(They Call Him OG) చిత్రాలకు కూడా ఇలా డూప్స్ ని విచ్చలవిడిగా వాడేశారు. ఇదంతా పక్కన పెడితే అసలు కల్కి(Kalki 2898 AD) చిత్రం లో ప్రభాస్ ఒక్క యాక్షన్ సన్నివేశం లో కూడా నటించలేదా?, మొత్తం డూప్స్ తోనే పని కానిచ్చారా? అని సోషల్ మీడియా లో ఇప్పుడు ఇతర హీరోల అభిమానుల నుండి తీవ్రమైన ట్రోల్స్ ఎదురు అవుతున్నాయి. సినిమా గత ఏడాది వచ్చింది. ప్రత్యేకంగా ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఈ సినిమా కి సంబంధించి కాసేపటి క్రితమే VFX కి ముందు, ఆ తర్వాత అంటూ ఒక వీడియో విడుదలైంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే ఫైట్ సన్నివేశం ఇది.

    ఈ ఫైట్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కనపడలేదు. వాళ్లకు బదులుగా డూప్స్ ని వాడారు. ఆ తర్వాత VFX లో ప్రభాస్ ముఖాన్ని జత చేసి, అవన్నీ ప్రభాస్ ఫైట్స్ అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసారు. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి. ప్రభాస్ సినిమాలు ఎందుకు వేగంగా పూర్తి అవుతున్నాయి అంటే, అందుకు కారణం ఇదా అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ దురాభిమానులు వెక్కిరిస్తున్నారు. ఇంత చిన్న సన్నివేశాలకు కూడా ఈ రేంజ్ డూప్స్ వాడుతారని ఊహించలేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా రిహార్సల్స్ అయ్యుంటాదని, ఒరిజినల్ ప్రభాస్ సొంతంగానే చేసి ఉండొచ్చని సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది మేకర్స్ ఖరారు చేసి చెప్పాలి. ఇకపోతే వచ్చే ఏడాది మొదటి భాగం లో ‘కల్కి 2’ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

     

    Also Read:  చిరంజీవికి యూకే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. మొదటి తెలుగు హీరో మెగాస్టార్