Dilruba Movie Review: గత సంవత్సరం ‘క’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘దిల్ రూబా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా కిరణ్ అబ్బవరం ఖాతాలో మరొక విజయాన్ని జత చేసిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాడు. అనుకోకుండా ఆ అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. దాంతో ప్రేమ మీద అతనికి ఉన్న ఇంట్రెస్ట్ అయితే పోతుంది… ఈ సంఘటన జరిగిన కొద్ది నెలల తర్వాత మరొక అమ్మాయితో ప్రేమలో పడతాడు. మరి మొదట ప్రేమించిన అమ్మాయి మళ్ళీ తన దగ్గరికి వస్తుందా? లేదంటే ఈ అమ్మాయినే తను పెళ్లి చేసుకుంటాడా? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
Also Read: దిల్ రూబా ట్విట్టర్ టాక్: కిరణ్ అబ్బవరం మూవీకి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్, ఇంతకీ హిట్టా ఫట్టా?
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా అదే ఊపులో మంచి విజయాన్ని సాధిస్తుందని అందరూ అనుకున్నారు. దర్శకుడు ఈ సినిమాకోసం ఎంచుకున్న పాయింట్ బావుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో కొంతవరకు తడబడ్డాడు. ఆయన మేకింగ్ మీద కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఉంటే బాగుండేది. సీన్ కి సీన్ కి మధ్య లింక్ అనేది వేసుకున్న విధానం బాగానే ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే ప్రేక్షకుడికి నచ్చలేదు. దానివల్ల అక్కడక్కడ ప్రేక్షకుడు కొంతవరకు ఇబ్బందిగా ఫీలయ్యే అవకాశమైతే ఉంది. ఇక దానికి తోడుగా స్క్రీన్ ప్లే లో కూడా పెద్దగా వైవిధ్యం అయితే చూపించలేదు.
ఇప్పటివరకు మనం చాలా సినిమాల్లో చూసిన స్క్రీన్ ప్లే నే వాడారు. దానివల్ల ఈ సినిమా మీద హైప్ రాకపోవడంతో పాటుగా సినిమాని అనుకున్న రేంజ్ లో తెరకెక్కించలేకపోయారు. ప్రతి సీన్ లో క్యూరియాసిటీని పెంచే విధంగా ప్రయత్నం చేశారు. కానీ అది అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదు. ఇక దాని మాదిరిగానే ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఒక యాక్షన్ ఎపిసోడ్ ను మినహాయిస్తే ఆయన పెద్దగా యాక్టింగ్ కూడా చేసింది అయితే ఏమీ లేదు…
ఇక శ్యామ్ సి ఎస్ మ్యూజిక్ కొంతవరకు ఈ సినిమాకు హెల్ప్ అయింది. కానీ ఈ సినిమా భారీ రేంజ్ లో సత్తా చాటాలేకపోయింది. ఎమోషనల్ సీన్స్ ను డీల్ చేసిన విధానంలో మరికాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఎంతో కొంత ప్రేక్షకులకు నచ్చేది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ఇంతకుముందు సినిమాల్లో చాలా బాగా నటించి మెప్పించేవాడు. కానీ ఈ సినిమాలో మాత్రం అంత పెద్దగా తన నటన ప్రతిభను చూపించలేకపోయాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో తన మార్క్ కనిపించేలా భారీ రిస్కీ షాట్స్ అయితే చేశాడు. కానీ నటుల పరంగా మాత్రం ఆయన పెద్దగా ప్రేక్షకుడి ఆకట్టుకోలేకపోయాడు… అయితే హీరోయిన్లు గా చేసిన ఇద్దరు అమ్మాయిలు సైతం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయారు. వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినప్పటికి బెస్ట్ పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోయారు… ఇక కీలకపాత్రలో నటించిన జాన్ విజయ్ సైతం చాలా బాగా నటించి మెప్పించే ప్రయత్నమైతే చేశాడు…
టెక్నికల్ అంశాలు
ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే శ్యామ్ సి ఎస్ మ్యూజిక్ ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ ను చెడగొట్టకుండా చాలా బాగా షాట్స్ ని కంపోజ్ చేసినప్పటికి సినిమాలో కంటెంట్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో విజువల్ గా దర్శకుడు దాన్ని స్క్రీన్ మీద సరిగ్గా లేకపోవడంతో సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది…
ప్లస్ పాయింట్స్
మ్యూజిక్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
కథ
స్క్రీన్ ప్లే
కిరణ్ అబ్బవరం యాక్టింగ్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5
