Jalsa Re Release
Jalsa Re Release: పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) నుండి సినిమా విడుదలై దాదాపుగా మూడేళ్లు కావొస్తుంది. 2022 వ సంవత్సరం లో విడుదలైన ‘భీమ్లా నాయక్’ తర్వాత మళ్ళీ ఆయన హీరోగా నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ‘బ్రో’ సినిమా విడుదలైంది కానీ, అందులో కేవలం ఆయన ప్రత్యేక పాత్ర మాత్రమే పోషించాడు. ఆ సినిమా వచ్చి కూడా ఏడాదిన్నర దాటిపోయింది. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుండి ఒక్క సినిమా విడుదల కావాలని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక మేరకు ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మే9 న విడుదల కాబోతుంది అంటూ నేడు ఆ సినిమా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసారు. వాస్తవానికి ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో మే 9 కి వాయిదా వేశారు.
Also Read: దిల్ రూబా’ ఫుల్ మూవీ రివ్యూ…
ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించి నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ నెల 20వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ ఈ బ్యాలన్స్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ‘హరి హర వీరమల్లు’ కి పోటీగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘జల్సా'(Jalsa Movie) చిత్రం రీ రిలీజ్ కానుందా. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి ఆరోజుల్లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అప్పటి ఆడియన్స్ కి చాలా అడ్వాన్స్ సినిమా కాబట్టి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది కానీ, కమర్షియల్ గా మాత్రం ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా నిల్చింది. ఈ సినిమాని రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ షోస్ వేశారు.
రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది, కేవలం స్పెషల్ షోస్ నుండే ఈ చిత్రానికి 3 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆరోజుల్లో ఈ ఇది ఆల్ టైం రికార్డు. మళ్ళీ ఈ సినిమాని ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరున కానీ, లేదా మే మొదటి వారం లో కానీ విడుదల చేయబోతున్నారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా సీజన్ లో ఇది విడుదల చేయడం ఏమిటి?, ఫ్యాన్స్ అడిగినప్పుడు రిలీజ్ చేయండి, మీకు ఇష్టమొచ్చినప్పుడు కాదు అంటూ ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మే నెలలో కాకుండా, విడుదల చేయాలని అనుకుంటే ఈ నెలలోనే చేయండి అని, లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో చేయండి అని అంటున్నారు. మరి దీనిపై గీతా ఆర్ట్స్ సంస్థ ఎలా స్పందించబోతుందో చూడాలి. ఒకవేళ ఈ చిత్రం విడుదలైనా అభిమానులు ఆదరించే పరిస్థితి లో లేరని అనుకోవచ్చు.