Kalki 2898 AD : కొన్ని సూపర్ హిట్ సినిమాలకు ఓటీటీ మరియు టీవీ టెలికాస్ట్ లో ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాదు. థియేటర్స్ లో ఇంతలా విరగబడి చూసిన ఆడియన్స్, టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఎందుకు కొన్నిసార్లు డిజాస్టర్ రెస్పాన్స్ ఇస్తారు అనేది చాలా మంది విశ్లేషకులకు అర్థం కాదు. రీసెంట్ గా జీ తెలుగు లో టెలికాస్ట్ అయిన ‘కల్కి 2898 AD’ చిత్రానికి వచ్చిన టీఆర్ఫీ రేటింగ్స్ ని చూసి అభిమానులకు దిమ్మి తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. BAARC సంస్థ అందించిన రేటింగ్స్ ప్రకారం ఈ చిత్రానికి కేవలం 5 రేటింగ్స్ మాత్రమే వచ్చాయట. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన సినిమాకి ఇంత తక్కువ టీఆర్ఫీ రేటింగ్స్ ఎందుకు వచ్చాయి అనేది అభిమానులకు అర్థం కాలేదు.
పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్ లో కనిపించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం కూడా జీ తెలుగు లోనే టెలికాస్ట్ అయ్యింది. కమర్షియల్ గా ఫ్లాప్ అని పిలవబడే ఈ చిత్రానికి మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు 7.2 రేటింగ్స్ ని సొంతం చేసుకుంది. కనీసం ఆ సినిమాకి వచ్చినంత టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ఇంత భారీ బడ్జెట్ చిత్రానికి రాలేదని సోషల్ మీడియా లో ట్రోల్స్ పడుతున్నాయి. కానీ ఈ కల్కి చిత్రానికి ఓటీటీ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా సుమారుగా మూడు నెలల పాటు టాప్ స్థానం లో ట్రెండ్ అయ్యింది. ఇప్పటికీ కూడా వీకెండ్స్ సమయంలో ట్రెండ్ అవుతూనే ఉంది. దీనిని బట్టి ఈ చిత్రం రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు అనుకోవాలి. కేవలం యూత్ ఆడియన్స్, అదే విధంగా ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు ఉన్నటువంటి కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే ఎక్కుతుంది.
ఇదంతా పక్కన పెడితే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలకు టీవీ లలో డిజాస్టర్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సాహూ, రాధే శ్యామ్, సలార్, కల్కి చిత్రాలకు చాలా తక్కువ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. సలార్ చిత్రానికి అయితే కేవలం నాలుగు టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చింది. కేవలం ఒక్క ఆదిపురుష్ చిత్రానికి మాత్రమే 10 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చింది. మిగిలిన సినిమాలంటికీ నాలుగు లోపే టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. అందుకు కారణం ప్రభాస్ సినిమాలు ఈమధ్య సాధారణ కుటుంబ ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ఉండడం లేదు. టీవీ ని 90 శాతానికి పైగా అలాంటి ఆడియన్స్ మాత్రమే చూస్తారు. ఇక్కడే ప్రభాస్ గత ఐదేళ్ల నుండి విఫలం అవుతున్నదని సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త. కనీసం రాబోయే రోజుల్లో వచ్చే సినెమాలకైనా భారీ టీఆర్ఫీ రేటింగ్స్ వస్తాయో లేదో చూడాలి.