Hari Hara Veeramallu : పుష్ప 2 ‘, ‘గేమ్ చేంజర్’ వంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ తర్వాత మన టాలీవుడ్ లో దగ్గర్లో విడుదల అవ్వబోతున్న మరో పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. షూటింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని మార్చి 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు గ్లిమ్స్ వీడియోస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పాడిన ‘మాట వినాలి’ సాంగ్ విడుదలై ఆడియన్స్ నుండి బీభత్సమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. చాలా సింపుల్ గా ఉన్నటువంటి ఈ పాటకి సంబంధించిన విజువల్స్ ని కూడా చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నారు మేకర్స్.
ఇకపోతే ఫిబ్రవరి 14 వ తేదీన ఈ సినిమాలోని రెండవ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. పూజిత పొన్నాడ స్పెషల్ గా డ్యాన్స్ వేసిన ఫెస్టివల్ థీమ్ సాంగ్ అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ పాటతో ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం ఎంత గ్రాండ్ గా తెరకెక్కించాడో ఫ్యాన్స్ కి తెలియబోతుందట. సినిమాకే హైలైట్ గా నిలవనున్న ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు మేకర్స్. సుమారుగా 500 మంది డ్యాన్సర్లు ఈ పాటలో కనిపించనున్నారట. సెట్ వర్క్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇంతటి గ్రాండ్ విజువల్స్ ని ఇంతకు ముందు ఎప్పుడూ అభిమానులు చూడని విధంగా, సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. ఇకపోతే ఈ నెల 26వ తేదీన ‘మాట వినాలి’ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేయబోతున్నారట.
ఇలా ప్రతీ రెండు వారాలకు ఈ చిత్రం నుండి ఒక ప్రమోషనల్ కంటెంట్ విడుదల అవుతుందని, అభిమానులకు పండగే అంటూ మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాకి VFX ని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి మూవీ టీం రెండు షిఫ్ట్స్ కలిసి కష్టపడుతున్నారట. కొన్ని షాట్స్ ని రీ వర్క్ కూడా చేస్తున్నారట. రీసెంట్ గానే బాబీ డియోల్ మీద పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్. రాజస్థాన్ లో బాబీ డియోల్ కి సంబంధించి కేవలం ఒక్క రోజు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. అదే విధంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి వారం రోజుల కాల్ షీట్స్ మిగిలి ఉంది. ఈ వారం నిర్మాత AM రత్నం పవన్ కళ్యాణ్ ని ఆ వారం రోజుల డేట్స్ కోసం మంగళగిరి లోని పార్టీ కార్యాలయం కి చేరుకొని చర్చించేందుకు విజయవాడకి వచ్చి ఉన్నారు.