Kalki 2 : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. వాళ్ల సినిమాలు చూడడానికే జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రావడమే కాకుండా సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదిస్తే మాత్రం ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచే దిశగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
Also Read : కల్కి 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అమితాబ్… ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్
ఈశ్వర్ (Eshwar) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్(Prabhas) ఆ సినిమా సక్సెస్ తో వరసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా వర్షం సినిమాతో ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఛత్రపతి సినిమాతో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అందుకే ఆయన స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా తనను తాను మరొకసారి భారీ రేంజ్ లో ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా స్థాయిని పెంచాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాయి.
ఇక ప్రభాస్ సినిమా ఏకంగా బాలీవుడ్ లోనే ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతుంది అంటే ఆయన క్రేజ్ ఇంతలా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం వచ్చిన కల్కి సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ప్రభాస్ కల్కి 2 సినిమాతో భారీ విక్టరీని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి పెట్టిన నాగ్ అశ్విన్ తొందరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లి మరోసారి పెను రికార్డులను కొల్లగొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక కల్కి 2 సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కీలకంగా మారబోతుందట. మొదటి పార్ట్ లో ఆయనకు పెద్దగా స్కోప్ అయితే లేదు. అమితాబచ్చన్ క్యారెక్టర్ మీదనే సినిమా మొత్తాన్ని నడిపించారు. కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ప్రభాస్ ఇమేజ్ ను మ్యాచ్ చేసేలా స్టోరీ కూడా ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడితో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తే మాత్రం అది చూసిన ప్రేక్షకులు థియేటర్ కి ఒకటికి రెండుసార్లు ఈ సినిమా చూడడానికి క్యూ కడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు…ఇక ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లో పాల్గొని తను చాలా బిజీగా ఉన్నాడు…