Kalki 2 Movie : మహాభారతం స్ఫూర్తిగా మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కల్కి చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న కల్కి 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అసలు కథ కల్కి 2లోనే ఉందని నాగ్ అశ్విన్ చెప్పాడు. పార్ట్ 1లో కేవలం పాత్రల పరిచయం, స్టోరీ వరల్డ్ ప్రేక్షకులకు తెలిసేలా చేశానని నాగ్ అశ్విన్ అన్నారు. కల్కి మూవీలో ప్రభాస్ బౌంటీ హంటర్ గా కనిపించాడు. కానీ ఆయన కర్ణుడు అని క్లైమాక్స్ లో రివీల్ చేశారు.
Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తప్పుకున్న శ్రీలీల? కారణం ఇదేనా?
ఇక అమితాబ్ అశ్వద్ధామ పాత్ర చేశాడు. సుమతి(దీపికా పదుకొనె)ను కాపాడడమే అశ్వద్ధామ లక్ష్యం. అయితే ప్రభాస్ ఆమెను విలన్ యాస్మిన్ కి అప్పగించి, సర్వ సుఖాలు ఉన్న కంప్లెక్స్ కి వెళ్లాలని కలలు కంటాడు. ఈ క్రమంలో అశ్వద్ధామ-కర్ణుడు మధ్య భీకర పోరాటాలు చోటు చేసుకుంటాయి. సుమతిని ప్రభాస్ ఎత్తుకు పోవడంతో ఫస్ట్ పార్ట్ ముగిసింది. ఇక ప్రధాన విలన్ యాస్మిన్ పాత్రకు పార్ట్ 1లో పెద్దగా స్కోప్ లేదు. పార్ట్ 2లో మాత్రం ప్రభాస్-కమల్ మధ్య అసలైన పోరు సాగనుంది.
కల్కి 2 కి సమయం పడుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పాడు. కాగా కల్కి 2 షూటింగ్ మే నెలలో మొదలు కానుందని సమాచారం అందుతుంది. ఈ అప్డేట్ స్వయంగా అమితాబ్ ఇచ్చాడు. కోన్ బనేగా కరోడ్ పతి షోలో మే నుండి కల్కి 2 షూటింగ్ లో పాల్గొననున్నట్లు వెల్లడించాడు. మే నుండి జూన్ వరకు ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారట. కల్కి 2 షూటింగ్ ఆరంభమైన నేపథ్యంలో రానున్న రెండేళ్లలో కల్కి 2 థియేటర్స్ లోకి వచ్చే సూచనలు కలవు.
కల్కి వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కల్కి 2 చిత్రానికి అంతకు మించిన రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్, పౌజీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. రాజాసాబ్ ఏప్రిల్ లో విడుదల కావాల్సింది. వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ చిత్రానికి మారుతి దర్శకుడు. పౌజీ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడిగా ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. స్పిరిట్, సలార్ 2, ప్రశాంత్ వర్మ చిత్రాలు ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.
Also Read : మీరు వర్జినా?.. ఐ యామ్ నాట్.. ప్రభాస్ హీరోయిన్ దిమ్మ తిరిగే ఆన్సర్! ఏమైంది అంటే?