Homeఎంటర్టైన్మెంట్Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తప్పుకున్న శ్రీలీల? కారణం ఇదేనా?

Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తప్పుకున్న శ్రీలీల? కారణం ఇదేనా?

Sreeleela: శ్రీలీల బిజీ హీరోయిన్. ప్రస్తుతం అరడజను సినిమాల వరకు ఆమె చేస్తుంది. శ్రీలీల గ్లామరస్ గా ఉంటుంది. ముఖ్యంగా డాన్సులలో ఆమె ఎనర్జీ వేరే లెవెల్. హిట్ పర్సెంటేజ్ కూడా ఉంది. ఈ కారణాలతో దర్శక నిర్మాతలు శ్రీలీల వెనకపడుతున్నారు. ఆ మధ్య శ్రీలీల నటించిన తెలుగు సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. శ్రీలీల ఖాతాలో ఉన్న క్రేజీ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండో చిత్రం ఇది. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

Also Read: కొత్త జంట చైతు-శోభిత సాహసాలు… రేస్ ట్రాక్ మీద దూసుకెళ్లిన స్టార్ కపుల్!

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సందిగ్ధంలో పడింది. కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని తాత్కాలికంగా వాయిదా వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టారు. ఎన్నికలు అయ్యాయి. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాడు. ఇటీవల తిరిగి ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ లో తిరిగి పాల్గొంటున్నారు.

ముందుగా హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలను పూర్తి చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తావన తేవడం లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఆ మూవీ చేస్తారా లేదా? అనే సందేహాలు ఉన్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా ఉన్న శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్ వలన తనకు డేట్స్ ప్రాబ్లమ్ రావచ్చని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ కి విరామం దొరికినప్పుడు మాత్రమే షూటింగ్ లో పాల్గొనగలరు. పలు చిత్రాలకు కమిటై ఉన్న శ్రీలీల, ఆయన షెడ్యూల్స్ ప్రకారం డేట్స్ ఇవ్వడం కుదరకపోవచ్చు.

ఈ కారణంగా పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరోతో మూవీ వదులుకోవడం ఇష్టం లేకున్నా.. తప్పుకున్నారు, అనే ఒక వాదన తెరపైకి వచ్చింది. ఈ పుకార్లలో నిజం ఎంత అనేది తెలియదు. ఇక శ్రీలీల-నితిన్ జంటగా నటించిన రాబిన్ హుడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. రవితేజ మాస్ జాతర, తమిళ్ మూవీ పరాశక్తి లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ కి జంటగా ఒక బాలీవుడ్ మూవీ చేస్తుంది.

RELATED ARTICLES

Most Popular