Kajol Ramoji Film City Revelations: హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ కి ఉన్నటువంటి పేరు ప్రతిష్టల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామోజీ రావు(Ramoji Rao) నిర్మించిన ఈ ఫిల్మ్ సిటీ లో ఎన్నో వందల సినిమాల షూటింగ్స్ జరిగాయి. మేకర్స్ కి అత్యాధునిక టెక్నాలజీ తో ఎక్విప్మెంట్ ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఎంత పెద్ద సెట్స్ అయినా నిర్మించుకోగల వెసులుబాటు ఈ స్టూడియోస్ లో ఉంటుంది. 1996 వ సంవత్సరం లో ఈ స్టూడియోస్ ని నిర్మించారు. ఇక్కడ తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం ‘మా నాన్నకు పెళ్లి’. శ్రీకాంత్, కృష్ణం రాజు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇది. అప్పటి నుండి నేటి వరకు ఎన్నో సంచలనాత్మక చిత్రాలను నిర్మించడానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) లో దెయ్యాలు తిరుగుతాయి అనే రూమర్ ఎప్పటి నుండో ఉంది అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?.
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ దేవగన్(Kajol Devgan) ఈ విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘దెయ్యాలు తిరిగే లొకేషన్స్ లో కూడా నేను ఎన్నో సార్లు షూటింగ్ చేయాల్సి వచ్చింది. అందుకు ఉదాహరణ మన హైదరాబాద్ లో ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ. ఇక్కడ కొన్ని స్పాట్స్ లో షూటింగ్ చేయడానికి వణికిపోతూ ఉంటారు. చాలా మంది దెయ్యాల అలికిడి విన్నాము అని చెప్తుంటారు. నాకు కూడా ఈ స్టూడియోస్ లోకి అడుగుపెట్టాలంటే చాలా భయం వేసేది’ అంటూ చెప్పుకొచ్చింది. కాజోల్ చెప్పే వరకు కూడా ఇందులో దెయ్యాలు ఉంటాయి అనే విషయం ఎవరికీ తెలియదు. ఆమె మాట్లాడిన మాటలను స్వయంగా మీరే వినండి ఈ క్రింది వీడియోలో. రామోజీ ఫిల్మ్ సిటీ కి పిల్లల్ని అప్పుడప్పుడు తల్లితండ్రులు పిక్నిక్ కోసం తీసుకెళ్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా వాళ్ళు తీసుకెళ్లగలరా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Also Read: Kajol: షారుఖ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పకపోవడంపై కాజోల్ ఆసక్తికర కామెంట్!
ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరగబోతుంది. అందుకోసం వారణాసి సెట్స్ ని కూడా రూపొందించారు. అంతే కాదు బాహుబలి చిత్రం షూటింగ్ మొత్తం ఇక్కడే తెరకెక్కించాడు డైరెక్టర్ రాజమౌళి. ఆ సెట్స్ ని ప్రేక్షకుల సందర్శనం కోసం ఇప్పటికీ అలాగే ఉంచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంచనాలనాత్మక చిత్రాలు ఈ స్టూడియోస్ నుండి వచ్చిన ప్రొడక్ట్స్. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కూడా ఇక్కడే అధిక శాతం షూటింగ్ ని జరుపుకుంది. అంతే కాకుండా ఈటీవీ లో ప్రసారమయ్యే సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోస్ వంటివి కూడా కొన్ని ఇక్కడ జరిగితే మరికొన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సారధి స్టూడియోస్ లో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అత్యంత ప్రాచుర్యం చెందిన ఫిల్మ్ సిటీ లో దెయ్యాల సంచారం ఉండడం నిజంగా వణుకు పుట్టించే విషయమే.
రామోజీ ఫిల్మ్ సిటీ గురించి సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటి కాజోల్!#RamojiFilmCity #Haunted #Hyderabad #Telangana #Kajol pic.twitter.com/wCWJWD2yrH
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 18, 2025