Game Changer: భారతీయుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు..? మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి..?

ప్రస్తుతం ఆయన భారతీయుడు 2 అనే సినిమాను చేస్తున్న విషయం మనకు తెలిసిందే...అయితే ఈ సినిమా లో ఉన్నప్పుడే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

Written By: Gopi, Updated On : May 21, 2024 10:32 am

what about the game changer situation..

Follow us on

Game Changer: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సూపర్ హిట్లను దక్కించుకున్న ఏకైక దర్శకుడు శంకర్…ఇక తమిళం లో మణిరత్నం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సమయంలో శంకర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి తమిళం లో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్ని కూడా తమిళ్ తెలుగులో సక్సెస్ లను సాధించాయి.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన భారతీయుడు 2 అనే సినిమాను చేస్తున్న విషయం మనకు తెలిసిందే…అయితే ఈ సినిమా లో ఉన్నప్పుడే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక దాంతో శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక ఈ సినిమా ఒక్క షెడ్యూల్ ముగిసిన తర్వాత మళ్లీ భారతీయుడు 2 సినిమాని స్టార్ట్ చేశారు. ఇక దానివల్లే ఆయన గేమ్ చేంజర్ సినిమాకి బ్రేక్ ఇచ్చి భారతీయుడు 2 సినిమా తీయాల్సిన అవసరం అయితే వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాని జూన్ 12వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు బాగానే ఉంది. మరి రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా శంకర్ ను ప్రశ్నిస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఆయన గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా సరిగా ఇవ్వడం లేదు. దానివల్లే ఆయన మీద చాలామంది అభిమానులకు తీవ్రమైన నిరాశ అయితే ఉంది. ఇక దాంతోనే ఇప్పుడు భారతీయుడు 2 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మరి గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా శంకర్ మీద కామెంట్లైతే చేస్తున్నారు…