Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరిలో ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ… ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేశారు. ఇక ఇంతకు ఈయన ముందు పరశురాం డైరెక్షన్ లో చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఫ్లాప్ అవడంతో దిల్ రాజు బ్యానర్ లోనే మరొక సినిమా చేయడానికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక అందులో భాగంగానే “రాజావారు రాణి గారు ” అనే సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు “రవి కిరణ్ కోలా”… ఇక ఈయన డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఇక దానికి సంబంధించిన పోస్టర్ ను విజయ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో విజయ్ కత్తి పట్టుకొని ఉండగా “కత్తి నాదే నెత్తురు నాదే యుద్ధం నాతోనే” అనే కొన్ని లైన్స్ ను కూడా రాశారు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే విజయ్ దేవరకొండ ఊర మాస్ సినిమాలో మనకు కనిపించబోతున్నాడని తెలుస్తుంది.
ఇక ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు ఫ్యామిలీని మెప్పించగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా పీరియాడికల్ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా మాస్ సినిమాగా రాబోతుంది. ఇక ఇదంతా చూస్తుంటే విజయ్ దేవరకొండ అన్ని జానర్స్ సినిమాలను టచ్ చేస్తూ ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక మొన్నటిదాకా కొన్ని సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే చేసిన విజయ్ ప్రస్తుతం వైవిధ్యాన్ని కనబరుస్తూ అన్ని జానర్స్ సినిమాలను ఏకకాలంలో చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలందరు వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తుంటే విజయ్ మాత్రం రెండు మూడు సినిమాలతో ప్లాపులను మూటగట్టుకొని కొంతవరకు డీలాపడ్డాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తేనే విజయ్ మరోసారి స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాడు…