https://oktelugu.com/

కాజల్ కమిట్మెంట్.. షాక్ అవుతున్న అభిమానులు..!

లాక్డౌన్.. కరోనా సమయాన్ని చందమామ కాజల్ అద్భుతంగా వినియోగించుకుంటోంది. ఎప్పుడు సినిమాలతో బీజీగా ఉండే కాజల్ అగర్వాల్ కరోనాతో తనకు దొరికిన సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళుతోంది. కరోనా టైంలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని అభిమానులకు షాకిచ్చింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ 35ఏళ్ల ఈ ముదురుభామకు అగ్రహీరోల సరసన ఇంకా అవకాశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఇన్నిరోజులు పెళ్లికి దూరంగా ఉన్న కాజల్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 11:52 AM IST
    Follow us on

    లాక్డౌన్.. కరోనా సమయాన్ని చందమామ కాజల్ అద్భుతంగా వినియోగించుకుంటోంది. ఎప్పుడు సినిమాలతో బీజీగా ఉండే కాజల్ అగర్వాల్ కరోనాతో తనకు దొరికిన సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళుతోంది. కరోనా టైంలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని అభిమానులకు షాకిచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    35ఏళ్ల ఈ ముదురుభామకు అగ్రహీరోల సరసన ఇంకా అవకాశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఇన్నిరోజులు పెళ్లికి దూరంగా ఉన్న కాజల్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరు ఇటీవల పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

    Also Read: బిగ్ బాస్ ఎంట్రీతో అవినాష్ కు జబర్దస్ గేట్లు క్లోజ్..!

    పెళ్లయిన తర్వాత హనీమూన్.. సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ఎవరైనా భావిస్తారు. కాజల్ అగర్వాల్ మాత్రం పెళ్లయిన మూడోరోజుకే షూటింగుల్లో పాల్గొని సినిమాలపై తన కమిట్మెంట్ ఏంటో నిరూపించుకుంది. పెళ్లికి ముందే తాను సినిమాల్లో కొనసాగుతానంటూ కాజల్ అగర్వాల్ అభిమానులకు మాటిచ్చింది.

    తాను చెప్పినట్లుగానే కాజల్ అగర్వాల్ తన భర్త కంటే కూడా అభిమానులకే ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలపై పైనే ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘ఆచార్య’లో చిరంజీవికి జోడిగా.. ‘ఇండియన్-2’ కమలహాసన్ పక్కన నటిస్తోంది. దీంతోపాటు కోలీవుడ్లో దుల్కన్ సల్మాన్ నటిస్తున్న ‘హే సినామికా’లోనూ నటిస్తోంది.

    Also Read: మళ్లీ వాయిదా పడిన అల్లు అర్జున్ ‘పుష్ప’.. కారణమెంటీ?

     కాజల్ దీపం(గ్లామర్) ఉండగానే ఇల్లు చక్కబెడుతుందనే కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం పాపం గౌతమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఏదిఏమైనా కాజల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.