
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బీజీగా మారడంతో సినిమాల్లో నటించడమే కష్టంగా మారింది. ఇటీవల పవన్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెల్సిందే. అదేవిధంగా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు లేకపోవడంతో పవన్ మళ్లీ రాజకీయాల్లో బీజీగా మారుతున్నాడు. దీంతో పవన్ ఇటీవల ఓకే చేసిన ఓ రీమేక్ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!
‘ఖైదీ-150’ మూవీతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుస మూవీలో బీజీగా మారారు. సినిమాల్లో తన సత్తా తగ్గలేదని ‘ఖైదీ-150’, ‘సైరా’ మూవీలతో చూపించారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఇటీవల శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుగా కరోనా ఎఫెక్ట్ సినిమా వాయిదా పడింది. లాక్డౌన్ సమయంలో చిరంజీవి పలువురి దర్శకుల కథలను వింటున్నారు. ఈ నేపథ్యంలో అరడజనుకు పైగా దర్శకులను చిరంజీవి లైన్లో పెట్టారు. వీరిలో ‘రంగస్థలం’ దర్శకుడు సుకుమార్, సుజీత్, బాబీ, హరీష్ శంకర్, మెహర్ రమేష్, పరశురామ్, అనిల్ రావిపూడిలు ఉన్నారు.
అయితే ఈ లిస్టులో దర్శకుడు మోహర్ రమేష్ పేరు ఉండటంపై మెగా ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీసీసీ మనకోసం మెహర్ రమేష్ పడుతున్న కష్టాన్ని గుర్తించిన చిరంజీవి అతడికి బ్రేక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది. ఈనేపథ్యంలో అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదాళం’ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈమూవీని ఎస్జే సూర్య పవర్ స్టార్ తో తెరకెక్కిస్తాడని గతంలో ప్రచారం జరిగింది.
విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?
కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగులు ఆగిపోవడం, రాజకీయాల్లో బీజీగా ఉండటంతో పవన్ ఈ మూవీ చేసేందుకు ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో మెగాస్టార్-మోహర్ రమేష్ కాంబినేషన్లో ‘వేదాళం’ రీమేక్ ఉండబోతుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది.ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులన్నీ చిరంజీవినే దగ్గరుంచి చూసుకోవాలని భావిస్తున్నారట. ఇందులో వాస్తవమెంతో త్వరలోనే వెల్లడికానుంది.